పొరలు… స్టాన్లీ కునిజ్, అమెరికను కవి
నేను చాలా జన్మలు ఎత్తాను
అందులో కొన్ని నావే కాని,
ఇప్పటి నేను, అప్పటి నేను కాదు,
జీవిగా కొన్ని లక్షణాలు మిగిలి ఉన్నప్పటికీ;
నేను వాటినుండి దూరంగా జరిగిపోకుండా ఉండడానికి
నానా తంటాలూ పడుతున్నాను.
నేను ముందుకి వెళ్ళడానికి
కావలసిన శక్తి సమకూర్చుకోవాలంటే
అలా చూసుకోడం తప్పనిసరి కాబట్టి,
నేను ఒకసారి వెనుతిరిగి చూసుకుంటే,
మైలు రాళ్ళన్నీ
తిర్యగ్రేఖవైపు జారిపోవడం గమనించేను;
విడిచిపెట్టిన మజిలీలలో వేసిన చలిమంటలు
క్రమంగా సన్నగా క్షీణించిపోతుంటే,
వాటిమీంచి బరువైనరెక్కలతో
దేవదూతలు నడచిపోతున్నారు.
నా అసలైన రాగద్వేషాలతో
అప్పుడే నేనొక గుంపుని సమీకరించేనన్నమాట.
ఇపుడు నా జాతి చెల్లాచెదరైపోయింది.
పేరుకుంటున్న నష్టాలపరంపరకి
నా హృదయాన్ని సమాధానపరిచేదెలా?
పెద్దగా ఎగసిపడుతున్న గాలిదుమారంలో
మార్గమధ్యంలో రాలిపోయిన
నా మిత్రుల భస్మధూళి కలిసి
నా ముఖాన్ని గట్టిగా తాకుతోంది.
అయినా సరే, నెను ముందుకి కదుల్తాను
ముందుకే కదుల్తాను, కొంచెం ఆహ్లాదంగానే అయినా!
నా గమ్యాన్ని చెరేదాకా
నా సంకల్పాన్ని సడలనీకుండా.
ఈ త్రోవలో నాకు ఎదురయ్యే ప్రతి మైలురాయీ
నాకు అపురూపమైనదే.
చంద్రుడిని మేఘాలు మ్రింగి
జీవితంలో శిధిలాలలో తిరుగాడిన
భయంకరమైన ఆ కాలరాత్రి
ఒక నల్లటి నీటిమేఘం ఇలా మార్గదర్శన చేసింది:
“నువ్వు శిధిలాలలో కాదు;
పొరలలో బ్రతుకు,” అని
ఆ మాటల అంతరార్థం గ్రహించగల
చాకచక్యం నాకు లేకపోయినా
నా జీవితంలో పరివర్తనని సూచించే
తర్వాతి అధ్యాయాలకి
ఉపోద్ఘాతం రాయబడింది.
నాలోని రాగల మార్పులకి
ముగింపు ఇంకా ప్రారంభం కాలేదు.
.
స్టాన్లీ కునిజ్
(July 29, 1905 – May 14, 2006)
అమెరికను కవి
.
The Layers
.
I have walked through many lives,
some of them my own,
and I am not who I was,
though some principle of being
abides, from which I struggle
not to stray.
When I look behind,
as I am compelled to look
before I can gather strength
to proceed on my journey,
I see the milestones dwindling
toward the horizon
and the slow fires trailing
from the abandoned camp-sites,
over which scavenger angels
wheel on heavy wings.
.
.
.
For complete poem visit:
.
Stanley Kunitz
(July 29, 1905 – May 14, 2006)
American
Stanley Kunitz was a Pulitzer Prize-winning poet noted for his subtle craftsmanship and his treatment of complex themes. He held the post of the Poet Laureate of America twice, first in 1974 and later in 2000.
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి