అనువాదలహరి

ఒక వేసవి పొద్దు… మేరీ ఆలివర్, అమెరికను కవయిత్రి

ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు?
ఆ తెల్లని హంసనీ నల్లని ఎలుగుని ఎవరు సృష్టించారు?
ఈ మిడతని ఎవరు సృష్టించారు?
ఈ మిడత…
గడ్డిలోంచి తన్నుకుంటూ పైకెగసిన ఈ మిడత
నా చేతిలోనున్న పంచదారని తింటున్న మిడత
పైకీ క్రిందకీ కాకుండా ముందుకీ వెనక్కీ దవడలు కదుపుతున్న ఈ మిడత
తన పెద్ద, సంకీర్ణమైన కనులతో నిక్కి చూస్తున్న మిడతని.
దాని బలహీనమైన ముందుకాళ్ళు పైకెత్తి తన ముఖాన్ని నులుముకుంటోంది.
దాని రెక్కల్ని చాచి టపటప కొట్టి ఒక్కసారిగా ఎగిరిపోయింది.
ప్రార్థన అంటే ఏమిటో నేను సరిగా చెప్పలేను
కానీ నేను ఏకాగ్రతగా పరిశీలించగలను, గడ్డిలో
ఎలా పడాలో, ఎలా మోకరిల్లాలో ఎరుగుదును.
హాయిగా ఏ పనీలేకుండా ఊరికే ఉండడం, పొలాల్లో నడుచుకుంటూ పోడం తెలుసును.
నేనిప్పుడు రోజంతా చేస్తున్నది అదే.
చివరికి అన్నీ మరణించవూ? జీవితం క్షణికం కాదూ?
ఏదీ, నీ విలువైన, సర్వతంత్ర స్వతంత్ర జీవితంతో
ఏమిటి సాధిద్దామనుకుంటున్నావో నాకొకసారి చెప్పుచూద్దాం?
.

మేరీ ఆలివర్

(Born September 10, 1935)

అమెరికను కవయిత్రి

.

The Summer Day

.

Who made the world?

Who made the swan, and the black bear?

Who made the grasshopper?

This grasshopper, I mean-

the one who has flung herself out of the grass,

the one who is eating sugar out of my hand,

who is moving her jaws back and forth instead of up and down-

who is gazing around with her enormous and complicated eyes.

.

.

.

.

.

.

For complete Poem  visit:

https://www.loc.gov/poetry/180/133.html

Mary Oliver

(born September 10, 1935)

American

 

%d bloggers like this: