వేగుచుక్క …. సెజారే పవేజ్, ఇటాలియన్ కవి
సముద్రం మీద చీకటితెరలు తొలగిపోకమునుపే ఒంటరి మనిషి ఒకడు లేచాడు.
చుక్కలు ఇంకా మిణుకుమంటూనే ఉన్నాయి. వెచ్చని చిరుగాలి
తీరం ఉన్న ఒడ్డునుండి ఎగసి,
ఊపిరికి కాంత ప్రశాంతతనిస్తోంది.
ఈ సమయం, ఏదీ చైతన్యవంతంగా ఉండే సమయం కాదు.
అతని నోట్లో వేలాడుతున్న పొగాకు గొట్టం సైతం
వెలిగించకుండానే ఉంది. చీకటి తెరలు తెరలుగా దట్టంగా ఉంది.
ఆ ఒంటరి మనిషి అప్పుడే చితుకులు ఏరి చలిమంట వెలిగించి
నేల ఎర్రబారుతుంటే దీక్షగా పరిశీలిస్తున్నాడు.
సముద్రం కూడా
త్వరలోనే మంటలా ఎర్రగా పైకి ఎగయబోతోంది.
అన్నీ మందకొడిగా ఉన్నపుడు
పొద్దుపొడవడంకన్నా బాధాకరమైనది మరొకటి లేదు.
పనికిరాకపోవడాన్ని మించిన కటువైనదీ మరొకటి లేదు
పచ్చగా మెరుస్తున్న ఒక నక్షత్రం
ఆకసంమీద అలసటతో వేలాడుతోంది, సూర్యోదయానికి ఆశ్చర్యపోతూ.
దానికి నల్లని సముద్రమూ, ఒక చిన్న మంటా పక్కనే
కాలక్షేపానికి చలికాచుకుంటూ ఒక మనిషి కనిపిస్తున్నారు.
వాళ్ళని చూసి, ఇంకా చీకటి వీడని కొండలమీద పరుచుకున్న
మంచు శయ్యమీద తిరిగి నిద్రకు ఉపక్రమించింది.
ఎంతకీ కదలని కాలం ఇక నిరీక్షించడానికి
ఎవ్వరూ లేని వారికి శాపంగా పరిణమిస్తోంది.
సూర్యుడు సముద్రం లోంచి పైకి లేవడమూ,
సుదీర్ఘమైన రోజు ప్రారంభం కావడమూ అవసరమా? రేపు,
వెచ్చని స్పష్టాస్పష్టపు వెలుగులతో సుప్రభాతం తిరిగి వస్తుంది.
అదీ నిన్నటిలాగే గడిచిపోతుంది. ఏక్కడా ఏదీ జరగదు.
ఆ ఒంటరి మనిషి కోరుకునేది నిద్ర ఒక్కటే.
ఆకసం నుండి చివరి తారక అదృశ్యమైన తర్వాత
ఆ మనిషి తన పొగాకు గొట్టాన్నిసిద్ధంచేసి వెలిగిస్తున్నాడు.
.
సెజారే పవేజ్
ఇటాలియన్ కవి
.

Morning Star (Lo Steddazzu)
The lonely man gets up when the sea is still dark
And the stars tremble. A warm breeze
Rises from the shore, where the seabed is,
And soothes the breath. This is the time in which
Nothing can happen. Even the pipe in his mouth
Dangles unlit. Nocturnal is the quiet swash.
The lonely man has already lit a bonfire of branches
And he watches as it reddens the soil.
The ocean too
Will soon surge like the fire.
Nothing is more bitter than the dawn of a day
In which nothing will happen. Nothing is more bitter
Than uselessness. A greenish star
Hangs tired in the sky, surprised by the sunrise.
It sees the ocean still dark and a patch of fire
Where the man, to kill time, keeps warm;
It sees and falls asleep amidst the gloomy mountains
In a bed of snow. The slowness of time
Is atrocious for those who have nothing to wait for, any longer.
Is it worth it for the sun to rise from the sea
And for the long day to begin? Tomorrow
The warm dawn will return with its diaphanous light
And it will be like yesterday and nothing will ever happen.
The lonely man wishes only to sleep.
When the last star in the sky vanishes,
The man slowly prepares his pipe and lights it.
.
(From Lavorare Stanca)
Cesare Pavese
9 September 1908 – 27 August 1950
Italian Poet Novelist, Critic and Translator
Poem Courtesy:
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి