ఇటుకపొడి… లూయిజా బ్రూక్
అదొక శైధిల్యపు నుసి మేట
ఏకధాటిగా గోడలు కూలిపోడమే.
ఒకప్పుడు “ఇల్లు” అనిపిలవబడేచోట
నా చిన్నతనం గడిచింది.
వీడ్ధుల్లో పియానోలపై ప్రశాంతంగా
ఫ్రాన్సు జాతీయగీతం వాయిస్తుంటే,
ఎండ మండిపోతున్నప్పుడు
ఆ అటకెక్కి ఏదో రాసుకుంటూండేదాన్ని
ఇంటి యజమాని సాలుపురుగు కూర్చున్నాడు
రాత్రివంటకాల వాసనావలయంలో
మనుషులు తమకుచ్చిటప్పాల నరకంలో
క్రమక్రమంగా మురిగిపోతున్నారు.
అక్కడ నే నేర్చుకున్నది తల్చుకుంటే జుగుప్స.
నేను రాత్రి తగలేసిన చమురుకీ
ఎండి పోయిన నా కలకీ
విచారిస్తూ కాలం వెళ్ళబుస్తూ ఉండవచ్చు.
.
లూయిజా బ్రూక్
Brick-Dust
.
IT’S just a heap of ruin,
A drunken brick carouse—
This thing my spirit grew in
That once was called a house.
An attic where I scribbled
Through baking summer days,
While street-pianos nibbled
At the patient Marseillaise.
The spider-landlord squatted
In a web of dinner-smells,
And people slowly rotted
In little gossip-hells.
I hated all I learned there—
And yet I could have cried
For a little oil I burned there,
A little dream that died.
.
Louisa Brooke
Courtesy: http://www.bartleby.com/273/68.html
Poetry, A Magazine of Verse
సౌందర్యం… ఆర్మెల్ ఒ కానర్
సూర్యుడు చాలాచోట్ల మెరిసిపోతున్నాడు
సౌందర్యం నేలమాళిగల్లోకి దిగబడుతోంది
ఒక దీపం ఎన్నో ముఖాల్ని తేజోమయం చేస్తుంది
దోషాన్నెత్తిచూపడంద్వారా, దోషరాహిత్యం నిర్వచిస్తోంది.
ప్రతి కొండా, ఆకాసమూ, సెలయేరూ
నా ప్రశ్నలకి ఒక దివ్యమైన సమాధానాన్ని
అందిస్తోంది: అనుగ్రహించినవాడి
అనుగ్రహం ఎన్నడూ తరిగిపోయేది కాదని.
అయినా, నేను సరిపోల్చుకుంటూ, సందేహిస్తూ
అకళంకమైన నా ఆనందాన్ని నాశనం చేసుకుంటాను
ఎవరూ పంచుకోలేని సంపద భగవంతుడే….
కాలాతీతమైన సౌందర్యం …ఇక నా పాలు.
.
ఆర్మెల్ ఒ కానర్
.
Beauty
.
The Sun shines bright in many places,
Beauty stoops into the vault;
One Light illumines many faces,
Shows perfection through the fault.
And every mountain, sky or river
Holds one heavenly reply
To my questions, from the Giver
Of the Gift that cannot die.
Yet I destroy my purest pleasure
While I hesitate, compare.
God is the undivided Treasure …
Timeless Beauty is my share.
(The Catholic World)
.
Armel O’Connor
Poem Courtesy: http://www.bartleby.com/273/4.html
వసంతంలో ఒంటరిగా…. కెరోలీన్ గిల్టినన్, అమెరికను కవయిత్రి
ఇంతకుమునుపెన్నడూ వసంతాన్ని ఒంటరిగా ఎదుర్కో లేదు;
ఆ పుష్పాలూ, ఆ పిట్టలూ, ఆ తరులతాదుల శోభా…
ఎప్పుడూ నాకు జంటగా నా ప్రేమిక ఉండడమే కారణం—
ఇటువంటి పారితోషికాలనుండి రక్షించగలిగేది, ప్రేమ ఒక్కటే!
కానీ, ఇపుడు నేను ఒంటరిని, సుదీర్ఘమైన
రేయింబవళ్ళిపుడు కేవలం జ్ఞాపకాలతో వెళ్ళబుచ్చడమే పని .
మేము జంటగా గడిపిన ఏప్రిల్ నెలలలో ఎన్నడైనా
వసంతం మనసునింత గాయపరిచేదిగా ఉందా?
మునుపెన్నడూ వసంతాన్ని ఒంటరిగా ఎదుర్కో లేదు
ఈ పసిడివెలుగుల వరద… నా దుఃఖాన్ని అతిశయిస్తోంది.
వసంతాగమనవేళ… ఒంటరిగా ఉండడమంటే… ఆ వ్యక్తి
మృతుడైనా అయి ఉండాలి… ముదిమి ఒక్కసారిగా పైబడైనా ఉండాలి.
.
కెరోలీన్ గిల్టినన్
(April 19, 1884 – ???)
అమెరికను కవయిత్రి
.
Alone in Spring
.
I NEVER met the Spring alone before:
The flowers, birds, the loveliness of trees,
For with me always there was one I love—
And love is shield against such gifts as these.
But now I am alone, alone, alone;
The days and nights one long remembering.
Did other Aprils that we shared possess
The hurting beauty of this living Spring?
I never met the Spring alone before—
My starving grief—this radiance of gold!
To be alone, when spring is being born,
One should be dead—or suddenly grown old.
[Contemporary Verse]
.
Caroline Giltinan
(April 19, 1884 – ???)
American
http://www.bartleby.com/273/39.html
సిద్ధసత్యాలు… కార్ల్ సాండ్బర్గ్, అమెరికను
ప్రతి ఏడూ ఎమిలీ డికిన్సన్ ఒక మిత్రుడికి
తనతోటలో పూసిన తొలి “ఆర్బ్యుటస్” మొగ్గల్ని పంపేది.
ఆండ్రూ జాక్సన్ తన మరణశాసనంలో
ఒక మిత్రుణ్ణి గుర్తుచేసుకుని జార్జి వాషింగ్టన్
వాడిన దూర్భిణి” ని అతనికి బహూకరించేడు.
నెపోలియన్ కూడా, తన వీలునామాలో, ఫ్రెడరిక్ ది గ్రేట్
పడకగదిలోంచి తను సంగ్రహించిన వెండి వాచీని
ఫలానా మిత్రుడికి దాన్ని అందజెయ్యవలసిందిగా ఆదేశించాడు.
ఓ హెన్రీ తనకోటుకి తగిలించుకున్న ఎర్రని పువ్వుని తీసి
కూరగాయలదుకాణంలో పనిచేస్తున్న పల్లెయువతికి ఇచ్చి
“ఎర్రనైన మొగ్గలు ఈ నగరాలలోని దుమ్మూధూళికి
ఎర్రగా మిగలొచ్చు, మిగలకపోవచ్చు” అని రాసేడుట.
అలా చెపుతుంటారు చాలా. కొన్ని నమ్ముతాం. కొన్ని నమ్మం.
టాం జెఫర్సర్ తన ముల్లంగికి మురిసిపోయేవాడట.
అబ్రహాం లింకన్ తనజోళ్ళు తనే పాలిష్ చేసుకునే వాడట,
బిస్మార్క్ బెర్లిన్ ని “ఇటుకలతో, వార్తాపత్రికలతో నిండిన నిర్జనప్రదేశం” అన్నాడట.
అలా అంటూనే ఉంటారు. ఇవన్నీ సిద్ధసత్యాలు:
అలా అలా అలా ఎగిరిపో కొత్త లోకాల్లోకి
ఎన్నడూ విని ఎరగని సముద్రాలు దాటిపో, ఈ భూమిని చుట్టిరా!
నీ చంక్రమణం పూర్తయి తిరిగి వచ్చేక ఏ పూచెట్టునీడనో కూచోవచ్చు
గోళీలకై కుర్రాళ్ళు తగువులాడుకోవడం వినొచ్చు.
మనకి మిడతే అందంగా కనిపించవచ్చు.
అదంతే…
.
కార్ల్ శాండ్బర్గ్
అమెరికను
.
Accomplished Facts
.
Every year Emily Dickinson sent one friend
the first arbutus bud in her garden.
In a last will and testament Andrew Jackson
remembered a friend with the gift of George
Washington’s pocket spy-glass.
Napoleon too, in a last testament, mentioned a silver
watch taken from the bedroom of Frederick the Great,
and passed along this trophy to a particular friend.
Henry took a blood carnation from his coat lapel
and handed it to a country girl starting work in a
bean bazaar, and scribbled: “Peach blossoms may or
may not stay pink in city dust.”
So it goes. Some things we buy, some not.
Tom Jefferson was proud of his radishes, and Abe Lincoln
blacked his own boots, and Bismarck called Berlin a wilderness of brick and newspapers.
So it goes. There are accomplished facts.
Ride, ride, ride on in the great new blimps—
Cross unheard-of oceans, circle the planet.
When you come back we may sit by five hollyhocks.
We might listen to boys fighting for marbles.
The grasshopper will look good to us.
So it goes….
.
Carl Sandburg
(January 6, 1878 – July 22, 1967)
American Poet.
Courtesy: http://www.bartleby.com/273/81.html
అసలు లేని వడ్డీ… రూమీ, పెర్షియన్ కవి
తినబొయేదానిమీద ఆశే, ప్రేమికుని నిలబెట్టేది;
చేతిలో రొట్టె ఉండనక్కరలేదు;
ప్రేమలో నిజాయితీ ఉన్నవాడు అస్తిత్వానికి బానిస కాడు.
ప్రేమికులకి అస్తిత్వంతో పనిలేదు.
ప్రేమికులు అసలు లేకుండా వడ్డీ గణిస్తారు.
రెక్కలులేకుండానే ప్రపంచం చుట్టివస్తారు;
చేతులు లేకుండనే, పోలోబంతిని మైదానం బయటకి కొనిపోతారు.
వాస్తవం ఆచూకీ పట్టుకోగలిగిన డార్విష్
అతని చేతులు ఖండించబడినా, బుట్టలల్లగలిగేవాడు
ప్రేమికులు తమ డేరాలని శూన్యంలో నిలబెట్టేరు
వాటి లక్షణం, గుణం రెండూ శూన్యాన్నిపోలినవే.
.
రూమీ
పెర్షియను కవి
The lover’s food is the love of the bread;
no bread need be at hand:
no one who is sincere in his love is a slave to existence.
Lovers have nothing to do with existence;
lovers have the interest without the capital.
Without wings they fly around the world;
without hands they carry the polo ball off the field.
That dervish who caught the scent of Reality
used to weave basket even though his hand had been cut off.
Lover have pitched their tents in nonexistence:
they are of one quality and one essence, as nonexistence is.
.
Rumi
Persian Poet and Sufi
poem Courtesy:
http://www.rumi.org.uk/passion.htm
గోడలు…. కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి
మరో ఆలోచనా, జాలి, బిడియమూ లేకుండా
వాళ్ళు నా చుట్టూ గోడలు కట్టేరు, ఎత్తుగా… మందంగా.
ఇప్పుడు నేనిక్కడ కూచుని నిస్సహాయంగా నిట్టూరుస్తున్నాను.
నేను మరొకటి ఆలోచించలేకున్నాను; ఈ దుస్థితి నా మనసు నమిలేస్తోంది
కారణం, ఆవల నేను చెయ్యవలసింది చాలా ఉంది.
వాళ్ళీ గోడలు కడుతున్నపుడు, నేనెలా పోల్చుకోలేకపోయానబ్బా!!!
నా కెన్నడూ మేస్త్రీలు కనిపించలేదు, పిసరంత చప్పుడైనా లేదు.
నేను గ్రహించలేనంత నేర్పుగా నన్ను బాహ్యప్రపంచానికి దూరం చేసేసేరు.
.
కన్స్టాంటిన్ కవాఫిజ్
April 29 1863 – April 29, 1933
గ్రీకు కవి
Poem Courtesy: http://cavafis.compupress.gr/kave_36.htm

Walls
.
With no consideration, no pity, no shame,
they have built walls around me, thick and high.
And now I sit here feeling hopeless.
I can’t think of anything else: this fate gnaws my mind –
because I had so much to do outside.
When they were building the walls, how could I not have noticed!
But I never heard the builders, not a sound.
Imperceptibly they have closed me off from the outside world.
Constantine P. Cavafy
April 29 1863 – April 29, 1933
Greek Poet
Poem Courtesy: Poem Courtesy: http://cavafis.compupress.gr/kave_36.htm
1800 th Post
ప్రేమ ఒక దృష్టిలోపం … సిల్వియా ప్లాత్, అమెరికను
చూసే దృష్టికోణం ద్వైదీభావనతో మోసగిస్తుంది:
రైలుపట్టాలు ఎప్పుడూ కలుస్తూనే ఉంటాయి,
మరెక్కడోకాదు, అసంభవమైన మనోనేత్రంలో.
సముద్ర తరంగాలు నింగిని కడుగుతున్నట్టు భ్రమింపజేసే క్షితిజరేఖను
దాటిపోదామని మేధోసాగరాలమీద దిగంతరాలకు
వెళుతున్న కొద్దీ, అవి వెనుకంజవేస్తూనే ఉంటాయి”
ఇది నిజమని మనం అంగీకరిస్తే, ఒకరి దేముడు
మరొకరికి దయ్యంగా కనిపించడం మనకి ఆశ్చర్యం కలిగించదు;
లేదా, సప్తవర్ణాల సూర్య కాంతి,
నీడలోని అనేకానేక వన్నెలుగా కనిపించవచ్చు;
సందేహాల ఊబిలో చిక్కినపుడు, ఎటూ తేల్చుకోలేకపోడమే
మనజీవితాలకి అధిగమించలేని పెద్ద అవరోధం
.
కనుక ప్రియతమా! రాత్రి నక్షత్రాలు మనకి జోలపాడేదాకా
ఈ విశ్వరహస్యాలకు చెందిన ప్రతి అంశపు మంచి చెడులగురించి
నువ్వూ నేనూ పిచ్చివాళ్లలా ఎంతసేపైనా వాదించుకోవచ్చు;
ఎంత స్పష్టమైన పడికట్టుమాటలతో విశ్లేషించినా
ఈ ప్రపంచం ఒక్క పిసరు కూడా మారదు, ఒక్క … గడియారం ముళ్ళు
పన్నెండు నుండి ఒకటికి నిరాఘాటంగా నడవడం మినహా .
మనం ఎంత పసలేని వాదనలని లేవదీస్తామంటే
వాటిని తర్కంతోనో, కాకుంటే అదృష్టంకొద్దీనో ఖండించడానికీ,
లేకుంటే సరదాకి మనం ఒకరితో ఒకరు విభేదించుకోడానికీ;
మనకి ఎవరో అన్నీ అమర్చిపెడుతుంటారు;
మనం దర్జా వెలగబెడతాం. ప్రేమ ఒక వనదేవత;
ఆమె తన చెలికత్తెల్ని పరిగెత్తిస్తూనే ఉంటుంది.
ఓ, నా మేధోనిధీ! ఇప్పుడు నువ్వు
సూర్యుడిని ఒక పెద్ద గుల్లచేపలా
ఒక్క గుటకలో, సముద్రం దిగువకి
నాచేత మింగించడానికి ప్రయత్నిస్తావు.
“చూస్తూండు! చీకటిలో ఆత్మహత్యచేసుకుంటున్న తోకచుక్క
నిద్రిస్తున్న ఈ నగరాన్ని అట్టుడికిస్తుంది” అనీ అంటావు.
కనుక, ఏదీ ఓ ముద్దుపెట్టు. వీధిలోని తాగుబోతులూ,
పరువులేని గుమ్మాలముందరి స్త్రీలూ వాళ్ల అసలుపేర్లు మరిచి,
తలమీద కొవ్వొత్తులతో గెంతులేస్తున్నారు.
ఆకులు చప్పట్లు కొడుతునాయి; శాంతా క్లాజ్
అందరికీ మిఠాయిలు పంచుతూ తన విమానంలో
పొడుపుకథలు పాటలుగా పాడుతూ వెళుతునాడు.
చంద్రుడు అందుకుందామని ఒకసారి వొంగుతాడు;
అపురూపమైన ఆ నదిలో వేటకి దొరక్క చేపలు నవ్వుతూ
కన్నుగీటుతాయి; ఎడా పెడా అందర్నీ పలకరిస్తూ మనం విచ్చలవిడిగా
ఆశీస్సులూ కురిపిస్తాం; చివరకి మూగవోయిన చర్చిఆవరణలోని
సమాధుల దగ్గర కూడా; నక్షత్రకాంతిలో మెరుస్తున్న
బిరుసెక్కిన సమాధులు జవాబుగా పాట ఎత్తుకునేదాకా.
ఏదీ మరొక ముద్దిచ్చుకో, ఈ రంగస్థలిమీది మన వెయ్యి అంకాల
నాటకానికి నిర్దయుడైన సృష్టికర్త వంగి తెర దించమనేలోగా
సిగ్గులేని నటులు ఎన్నిరకాలుగానైనా అతన్ని అనుకరించవచ్చు,
థియేటరులో దీపాలు వన్నె తగ్గి, రంగస్థలి ముందరిదీపాలు వెలగగా,
కుప్పలు తెప్పలుగా గులాబి దుస్తుల బఫూన్లు చిత్రధ్వనులతో, అనుకరణలతో
రంగస్థలికి ఒక ప్రక్కనుండి రెండోప్రక్కకి పాడుతూ పోనూవచ్చు.
ఇప్పుడు చెప్పు, నలుపో తెలుపో మొదలైన చోట దెప్పుతాం
వేణువుల్ని వాయులీనాలనుండి వేరుచేస్తాం:
పరిపూర్ణతల బీజగణితం
ఆకారాలు వికారంగా కదిలే చిత్రదర్శినిలో
భగ్గుమంటుంది; వాదించే ప్రతికోతీ
తన శత్రుకూటమిలో చేరిపోతుంది.
ఇక్కడున్న వైరుధ్యం నటనే వస్తువు కావడం:
ప్రముఖతార మూతివిరిచినా, విమర్శకుడు తప్పుపట్టినా
ఆ వల్లించిన సంభాషణల పరంపరలో అంతర్లీనంగా
కళ ఉట్టిపడుతూనే ఉంటుంది, క్షణకాలం పాత్రలో మమేకమవడం ఉంటుంది
దాన్ని స్వాప్నికులు నిజమనుకుంటే, వాస్తవికవాదులు భ్రాంతి అంటారు.
ఎగురుతున్న పక్షులగుంపును చూసినప్పటి అనుభూతి అది.
ఆకసాన్ని చీల్చే కిరణాలు, తమ ప్రయాణంలోనే
తన్మయత్వపు రహస్యం దాగుందని తెలిసి ;
ఏదో ఒకరోజు, పయనిస్తూ పయనిస్తూ, రాలిపోతుంది
అలా రాలి, మరణిస్తుంది ఒకగాయాన్ని చేస్తూ.
అది తిరిగి గాయం మానుతుంటే, రేగుతుంది
జననమరణాల ఫీనిక్స్ చక్రం ఎన్నడూ ఆగదు.
కనుక మనం శిధిలమైన ప్రపంచమనే
“వాల్-నట్” పెంకులమీంచి ఉత్తికాళ్ళతో నడుద్దాం
అల్పమైన స్వర్గ నరకాల్ని ఆత్మలు దాసోహమని
అరిచేలా మట్టుపెడదాం; మన శయ్యని “జాక్ “
చిక్కుడుపందిరి అంత ఎత్తులో కట్టుకుందాం;
మనకి మిగిలి ఉన్న రోజులూ వారాలూ
పదునైనకత్తి తెగనరికేదాకా ప్రేమించుకుందాం.
అప్పుడు, నీలి గుడారం వాలిపోతుంది, చుక్కలు జలజలా రాలిపోతాయి.
భగవంతుడో, శూన్యమో మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి
మన కన్నీళ్ళలో మనం మునిగిపోయేదాకా; కనుక ఇవాళే ప్రారంభిద్దాం
మురళీధరుడికి ఒక్కొక్క శ్వాసతో ఋణం తీర్చుకోవడం.
అయినా, ప్రేమకి మృత్యువు గురించీ తెలీదు
హృదయాన్ని హృదయంతో కలపడం దాటి లెక్కలూ రావు.
.
సిల్వియా ప్లాత్
October 27, 1932 – February 11, 1963
అమెరికను
.
Love is a Parallax.
.
‘Perspective betrays with its dichotomy:
train tracks always meet, not here, but only
in the impossible mind’s eye;
horizons beat a retreat as we embark
on sophist seas to overtake that mark
where wave pretends to drench real sky.’
.
‘Well then, if we agree, it is not odd
that one man’s devil is another’s god
or that the solar spectrum is
a multitude of shaded grays; suspense
on the quicksands of ambivalence
is our life’s whole nemesis.
.
So we could rave on, darling, you and I,
until the stars tick out a lullaby
about each cosmic pro and con;
nothing changes, for all the blazing of
our drastic jargon, but clock hands that move
implacably from twelve to one.
.
We raise our arguments like sitting ducks
to knock them down with logic or with luck
and contradict ourselves for fun;
the waitress holds our coats and we put on
the raw wind like a scarf; love is a faun
who insists his playmates run.
.
Now you, my intellectual leprechaun,
would have me swallow the entire sun
like an enormous oyster, down
the ocean in one gulp: you say a mark
of comet harakiri through the dark
should inflame the sleeping town.
.
So kiss: the drunks upon the curb and dames
in dubious doorways forget their Monday names,
caper with candles in their heads;
the leaves applaud, and Santa Claus flies in
scattering candy from a zeppelin,
playing his prodigal charades.
.
The moon leans down to took; the tilting fish
in the rare river wink and laugh; we lavish
blessings right and left and cry
hello, and then hello again in deaf
churchyard ears until the star lit stiff
graves all carol in reply.
.
Now kiss again: till our strict father leans
to call for curtain on our thousand scenes;
brazen actors mock at him,
multiply pink harlequins and sing
in gay ventriloquy from wing to wing
while foot lights flare and house lights dim.
.
Tell now, we taunt where black or white begins
and separate the flutes from violins:
the algebra of absolutes
explodes in a kaleidoscope of shapes
that jar, while each polemic jackanapes
joins his enemies’ recruits.
.
The paradox is that ‘the play’s the thing’:
though prima donna pouts and critic stings,
there burns throughout the line of words,
the cultivated act, a fierce brief fusion
which dreamers call real, and realists, illusion:
an insight like the flight of birds:
.
Arrows that lacerate the sky, while knowing
the secret of their ecstasy’s in going;
some day, moving, one will drop,
and, dropping, die, to trace a wound that heals
only to reopen as flesh congeals:
cycling phoenix never stops.
.
So we shall walk barefoot on walnut shells
of withered worlds, and stamp out puny hells
and heavens till the spirits squeak
surrender: to build our bed as high as jack’s
bold beanstalk;lie and love till sharp scythe hacks
away our rationed days and weeks.
.
Then jet the blue tent topple, stars rain down,
and god or void appall us till we drown
in our own tears:today we start
to pay the piper with each breath, yet love
knows not of death nor calculus above
the simple sum of heart plus heart.
.
Sylvia Plath.
Poem Courtesy: http://www.eliteskills.com/c/14985
Related articles
-
For Sylvia Plath’s 80th Birthday, Hear Her Read ‘A Birthday Present’ (openculture.com)
-
Quote of the day: Sylvia Plath (hotchocolateandbooks.wordpress.com)
-
Lady Lazarus ( Sylvia Plath ) (zendialogue.wordpress.com)
సాగరసుమాలు… ఇ.జె.ప్రాట్, కెనేడియన్ కవి.
అవి విహరిస్తూ ఒక క్షణంలో చేసిన విన్యాసాన్ని
వివరించడానికి భాషలో తగిన ఉపమానాలు లేవు…
రజతము, స్ఫటికము, దంతము
అన్నీ కళతప్పేయి. వినీలాకాశం మీద చెక్కినట్టున్న
లిప్తపాటు కదలికలేని ఆ దృశ్యానికి సాటిలేదు,
ఆ రెక్కల కదలిక, తేలి తేలి ఎగిరే తీరూ ముందు
ఉష్ణమండలంలో నీలి నేపథ్యంలో తేలిపోయే చుక్కలూ
పర్వతాగ్రాలమీద కురిసిన మంచూ దిగదుడుపే.
సూర్యుడి ఏడురంగుల్ని పట్టుకున్న కొండకొమ్ముల్లోనో
మధ్యలో ఎక్కడో లంకల్లో కనిపించిన పచ్చికమైదానాల్లోనో
ఒకదాని వెనక ఒకటి ఇపుడు క్రిందకి వాలుతూ
ఒక్కసారిగా వేల రెక్కలు ముడుచుకున్నాయి.
మట్టిలోంచి విచ్చిన ఏ తెల్లకలువలూ
ఇంతస్వేఛ్ఛగా విహరించలేవు
ఈ సర్వస్వతంత్ర సాగరసుమాలు విహరించినట్టుగా
.
ఇ.జె. ప్రాట్
February 4, 1882 – April 26, 1964
కెనేడియన్ కవి
.
Sea-Gulls
.
For one carved instant as they flew,
The language had no simile —
Silver, crystal, ivory
Were tarnished. Etched upon the horizon blue,
The frieze must go unchallenged, for the lift
And carriage of the wings would stain the drift
Of stars against a tropic indigo
Or dull the parable of snow.
Now settling one by one
Within green hollows or where curled
Crests caught the spectrum from the sun,
A thousand wings are furled.
No clay-born lilies of the world
Could blow as free
As those wild orchids of the sea.
.
E J Pratt (Edwin John Dove Pratt)
February 4, 1882 – April 26, 1964
Canadian Poet
http://wonderingminstrels.blogspot.in/2001/05/sea-gulls-e-j-pratt.html
యుద్ధభూములమీదుగా తూరుపుగాలి … ఏలన్ డూగన్
రాత్రల్లా కొన్ని వేల యోజనాలు ప్రయాణం చేసి వచ్చింది గాలి
ఈ ఉదయం దగ్గరగా దువ్వుకున్న నీ జుత్తును చెదరగొడుతూ.
అది దీర్ఘప్రయాణం చేసి, త్రోవమరచిన సముద్రపక్షుల్ని తనతో
తీసుకొచ్చింది, పాడుతూ. ఎప్పటివో పురాతన గీతాలు
పాత రణస్థలాలూ, శ్మశానాలనుండి, కొత్తచోట్లలో కొత్తగా వినిపిస్తూ.
అవి కొత్తగా వినిపించడానికి వసంతం కారణం కావచ్చు,
నీ కురులలో బద్ధకంతీర్చుకుంటున్న నిన్నటి తెమ్మెరలా.
మనదికాని వాతావరణం ఏదైనా ఎంతో కొత్తగా కనిపిస్తుంది.
దాన్ని నువ్వు ఆస్వాదిస్తావు, గుండెనిండా పీల్చుకుంటూ,
ఆ గాలి యుద్ధభూములలోని కంపునంతా మోసుకుని, సమాధి కరువైనవారి
మృత్తిక కుమ్మరివాని పరిసరాలకు మోసుకెళుతుంది. మైళ్ళపొడవునా
సముద్రపు అలల తుంపరలపై తన కంపు పోగొట్టుకుని, తీయనై,
నిను చేరుసరికి నీకు కమ్మగా, హాయిగా, ఆహ్లాదకరంగా ఉంటుంది
అదృష్టం కొద్దీ దాని ఉప్పదనం నీ భుజం వెనకే పోగొట్టుకుంది.
ఇపుడు నీ అధరహాసం పలచని చిరుగాలి సమాధిపలకలపై
నీ పిల్లలపేర్లు చెక్కుతున్న ఉలిలా ధ్వనించడంలో వింతలేదు.
.
ఏలన్ డూగన్
12 Feb 1923 – 3 Sep 2003
అమెరికను
.
.
On An East Wind From The Wars
The wind came in for several thousand miles all night
and changed the close lie of your hair this morning. It
has brought well-travelled sea-birds who forget
their passage, singing. Old songs from the old
battle- and burial-grounds seem new in new lands.
They have to do with spring as new in seeming as
the old air idling in your hair in fact. So new,
so ignorant of any weather not your own,
you like it, breathing in a wind that swept
the battlefields of their worst smells, and took the dead
unburied to the potter’s field of air. For miles
they sweetened on the sea-spray, the foul washed off,
and what is left is spring to you, love, sweet,
the salt blown past your shoulder luckily. No
wonder your laugh rings like a chisel as it cuts
your children’s new names in the tombstone of thin air.
.
Alan Dugan
12 Feb 1923 – 3 Sep 2003
American
Pulitzer 1962
Poem Courtesy:
http://www.npr.org/2011/04/06/134745994/poetry-with-an-edge-the-acerbic-wit-of-alan-dugan
చెడుసావాసాలకి వ్యతిరేకంగా… ఐజాక్ వాట్స్, ఇంగ్లీషు కవి
ఆడుతున్నవాళ్ళతో నేనెందుకు కలవాలి
వాళ్ళతో జతకలవడం నాకిష్టం లేదు.
వాళ్ళు తిట్లూశాపనార్థాలు పెడతారు, ఎన్నడూ ప్రార్థించరు
అన్ని రకాలపేర్లూ పెట్టి పిలుస్తారు, పోట్లాడుతారు.
నాకు ఆ పోకిరీ పాట వినడమంటే అసహ్యం
వాళ్ళ మాటలు నా చెవులకు కఠోరంగా వినిపిస్తాయి
వాళ్ళు మాటాడే భాష ఉపయోగించి
నేను నా నాలికని అపవిత్రం చేయ సాహసించను
ఆ మూర్ఖులనుండి నా దృష్టి తప్పిస్తాను
ఆ ఎగతాళి చేసే వాళ్ళతో కూడమన్నా కూడను.
నేను తెలివైన వాళ్ళతో అడుగులు కలుపుతాను
ఎప్పుడో ఒకప్పుడు నేనూ తెలివైనవాడిని కాకపోను.
ఎగతాళి చేసే ఒక సంస్కారహీనుడినుండి
పదిమంది ఆ అవహేళన విద్య నేర్చుకుంటారు.
ఒక రోగిష్టి గొర్రె మందంతటికీ రోగం సోకించి
అన్నిటినీ విషపూరితం చేసినట్టు.
.
ఐజాక్ వాట్స్
(17 July 1674 – 25 November 1748)
ఇంగ్లీషు కవి
.
.
Against Evil Company
Why should I join with those in Play,
In whom I’ve no delight,
Who curse and swear, but never pray,
Who call ill Names, and fight.
I hate to hear a wanton Song,
Their Words offend my Ears:
I should not dare defile my Tongue
With Language such as theirs.
Away from Fools I’ll turn my Eyes,
Nor with the Scoffers go;
I would be walking with the Wise,
That wiser I may grow.