అదలా ఉండొచ్చు; కానీ తెలియనిదాన్ని అలానే ఉండనీ. భూమి మీద మనమందరం సూర్యుడి సేవకులం. నాలోని చైతన్యమంతా సూర్యుడినుండే వస్తుంది, అతని అమృతస్పర్శే సకలజీవులకూ ప్రాణభిక్ష.
మనంశూన్యంలో తిరుగుతున్నామంటే అతని శక్తివల్లనే అతని యవ్వనం గ్రీష్మం, మన ఆహారం అతని మగసిరే సౌందర్యం అంటే అతని ముఖంలోకి చూడగలగడమే అతను చీకటి తొలగించి, పూలకు రంగులద్దుతాడు.
అతనేమిటో, ఎవరికి తెలుసు? కానీ, మనం అతని సొత్తు అతనిచుట్టూ రోదసిలో ప్రదక్షిణం చేస్తాం, ఏళ్ళకి ఏళ్ళు మనందరం చెట్టుకు పూచి వాడిపోతున్న ఆకులం ఎవరి లాలసలు, అధికారాలు, భయాలు వాళ్ళవి.
మనం ఏమవుతామో ఎవరికెరుక? కానీ ప్రతి ఒక్కరం ధూళికణం మీద ధూళికణంలా సూర్యుడి సేవకులం.