నిరంకుశుడు… చెస్లా మీవోష్, పోలిష్ కవి

[ప్రజల్ని ఎంత అణగదొక్కినప్పటికీ, దయారహితమైన మితిలేని ద్వేషం మనుషుల మనసుల్నీ, జీవనస్ఫూర్తినీ చిదిమెయ్యలేరు.  చెస్లావ్ మీహోష్ ప్రత్యక్షంగా అటువంటిది  అనుభవించినవాడు. 1951లో దేశాన్ని విడిచి ముందు ఫ్రాన్సుకీ తర్వాత అమెరికాకీ వెళ్ళకముందు రెండవ ప్రపంచ సంగ్రామ కాలంలో వార్సవాలో పోలిష్ ప్రతిఘటన ఉద్యమం లో పనిచేశాడు.  ]

***

దురాక్రమణకీ, సర్వభక్షణకీ మారుపేరు నువ్వు

అల్లకల్లోలంచేసి, ఆవేశాలు రెచ్చగొట్టి కుళ్ళిపోయావు నువ్వు.

నువ్వు వివేకుల్నీ, ప్రవక్తల్నీ, నేరగాళ్ళనీ,

కార్యశూరుల్నీ ఒకేగాటకట్టి, నజ్జునజ్జు చేస్తావు.

నేను నిన్ను సంభోదించడం నిరుపయోగం.

నిన్ను సంభోదించినా, నువ్వు నా మాట వినవు,

అయినామాటాడతాను, నీకు ఎదురుతిరిగాను కనుక .

నన్నుకూడా భక్షిస్తే ఏమవుతుంది? నేను నీ వాడిని కాదు.

నన్ను అలయబెట్టి, పొగబెట్టి వశం చేసుకుంటావు

నిన్ను ఆక్షేపించే నా ఆలోచనలను మసకబారుస్తావు

ఒళ్ళు పై తెలియని అధికార దర్పంతో నామీంచి దొర్లిపోతావు.

నిన్ను గెలిచేవాడు సాయుధుడూ, మహాచురుకైనవాడూ:

మేధలో, ఉత్సాహంలో, సృజనలో, పునరుద్ధరణలో.

నువ్వు ఎంత ఉన్నతంగా, నీచంగా పోరాడితే, తగ్గట్టు పోరాడతాడు

వాడు ఆశ్వికుడు, రెక్కలున్నాయి, ఉదాత్తుడు, కవచధారి.

అతని నియమించినపుడు పనిచేశాను.

అతను నన్నేంచేస్తాడన్నది ఇక్కడ సందర్భం కాదు.

సుప్రభాతవేళ సరోవరతీరాలవెంబడి సేనలు ముందుకి ఉరుకుతున్నాయి.

మంచుకప్పిన పల్లెల్లో ఈస్టరు గంటలు మోగుతున్నాయి.

.

చెస్లా మీవోష్

30 June 1911 – 14 August 2004

పోలిష్ కవి

Czesław Miłosz

.

You Whose Name

.

You whose name is aggressor and devourer.

Putrid and sultry, in fermentation.

You mash into pulp sages and prophets,

Criminals and heroes, indifferently.

My vocativus is useless.

You do not hear me, though I address you,

Yet I want to speak, for I am against you.

So what if you gulp me, I am not yours.

You overcome me with exhaustion and fever.

You blur my thought, which protests,

You roll over me, dull unconscious power.

The one who will overcome you is swift, armed:

Mind, spirit, maker, renewer.

He jousts with you in depths and on high,

Equestrian, winged, lofty, silver-scaled.

I have served him in the investiture of forms.

It’s not my concern what he will do with me.

A retinue advances in the sunlight by the lakes.

From white villages Easter bells resound.

.

Czeslaw Milosz

30 June 1911 – 14 August 2004

Polish Poet

Nobel Prize 1980

http://wonderingminstrels.blogspot.in/2003/04/you-whose-name-czeslaw-milosz.html

No matter how oppressed a people are, the “dull unconscious power” of hatred can never crush the mind and spirit of human.  C. Milosz knows this first-hand.  He worked with the Polish Resistance movement in Warsaw during World War II before defecting to France in 1951 and finally the United States in 1960.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: