రెండేళ్ళపాటు… వెల్డన్ కీస్, అమెరికను కవి
ఈ శూన్యస్థితి, దానిమీదే అది బ్రతుకుతుంది:
గిరగిరా తిరిగి అరచేతిలోని నీళ్ళలో గీతలు గీస్తుంటుంది,
సగం భావాలు అర్థాంతరంగా గాల్లో వేలాడుతుంటాయి,
ఆలోచనలు గాజు పగిలినట్లు మనసులోనే భళ్ళున పగుల్తుంటాయి
ప్రపంచాన్ని ప్రతిబింబించే తెల్లని కాగితాలు
నను మౌనంలోకి త్రోసిన ప్రపంచాన్ని మరింత తెల్లగా చూపిస్తున్నాయి.
అలా రెండేళ్ళు గడిచిపోయాయి. మెల్లిగా
ముక్కముక్కలుచేసి, నిలువునా చీల్చి, గాయపరచి, పగుళ్ళు వేసి,
చిక్కుల్లోపెట్టి, మనసు విరిచిన సంగతులన్నీ నన్ను
ఎంతటి క్షీణస్థితికి తెచ్చాయంటే, నేను మండిమండి
చివరకి కొడిగట్టే స్థితికి చేరుకున్నాను. ఇపుడు
అనుభవం నేర్చిన చేతిలో నా పేరు రాసుకుంటాను. నాకే అపరిచితమైన
గొంతుతో, రూపురేఖలు మారిన గదుల్లోని నిశ్శబ్దంతో మాటాడుతుంటాను
పదేపదే గుర్తుకువచ్చి, పునరావృతమయే జ్ఞాపకాలతో జలదరిస్తూ…
.
వెల్డన్ కీస్
February 24, 1914 – July 18, 1955
అమెరికను కవి
Weldon Kees
Courtesy: Poetry Foundation
.
Covering Two Years
.
This nothingness that feeds upon itself:
Pencils that turn to water in the hand,
Parts of a sentence, hanging in the air,
Thoughts breaking in the mind like glass,
Blank sheets of paper that reflect the world
Whitened the world that I was silenced by.
There were two years of that. Slowly,
Whatever splits, dissevers, cuts, cracks, ravels, or divides
To bring me to that diet of corrosion, burned
And flickered to its terminal. – Now in an older hand
I write my name. Now with a voice grown unfamiliar,
I speak to silences of altered rooms,
Shaken by knowledge of recurrence and return.
.
Weldon Kees
February 24, 1914 – July 18, 1955
American Painter, Poet, Literary Critic, Novelist, Playwright, short story writer, Jazz Pianist, and Film maker.
Poem Courtesy:
దీన్ని మెచ్చుకోండి:
ఇష్టం వస్తోంది…
స్పందించండి