ఒక హిమ రాత్రి … బోరిస్ పాస్టర్ నాక్, సోవియట్ రష్యా

మంచు కురుస్తూ, కురుస్తూ ఉంది, ప్రపంచమంతటా

సృష్టీ ఈ మూలనుండి ఆ మూలకి మంచుతో కప్పబడింది.

మేజా మీద ఒక కొవ్వొత్తి వెలుగుతోంది;

ఒక కొవ్వొత్తి మండుతోంది.

వేసవిలో దీపంచుట్టూ చేరి

పురుగులు తమ రెక్కలు కొట్టుకున్నట్టు

ఆరుబయట సన్నని తీగసాగిన మంచు పలకలు

కిటికీ అద్దానికి కొట్టుకుంటున్నాయి.

మంచు తుఫాను గాజు తలుపుమీద

బాణాల్లా, శంఖాల్లా అకృతులు రచిస్తోంది.

మేజా మీద ఒక కొవ్వొత్తి వెలుగుతోంది;

ఒక కొవ్వొత్తి మండుతోంది.

వెలుగునిండిన గదిలోపల, కప్పుమీద

చిత్రంగా సాగుతూ నీడలు పడుతున్నాయి,

చేతులుకట్టుకున్న నీడలూ, అడ్డకాళ్ళ నీడలూ

అగమ్యమైన భవిష్యత్తు నీడలూ

రెండు చిన్న జోళ్ళు మీదనుండి

క్రిందకి దబ్భుమని పడ్డాయి.

పానుపు ఆనుకున్న మేజామీది కొవ్వొత్తి

దుస్తులమీద మైనపు కన్నీరు కార్చింది.

లోపల అన్నీ కనిపించకుండా మాయమయ్యేయి.

మసక మసకగా, చిక్కబడుతున్న చీకటితోపాటే

మేజా మీద ఒక కొవ్వొత్తి ఆరిపోయింది;

ఒక కొవ్వొత్తి మండుతూనే ఉంది.

మూలనుండి వీచిన ఓ గాలిరివటకి

దీపం రెపరెపలాడింది, అనంగరాగపు చిరువేడి

శరీరమంతా అలుముకుంది. అల్లాడుతున్న మన్మధుని రెక్కలు

శిలువ ఆకారంలో క్రీనీడలు వేస్తున్నాయి.

ఫిబ్రవరి నెలంతా మంచు తెగ కురిసింది,

ఒక్కరోజన్నా విడిచిపెట్టలేదేమో అన్నంతగా

మేజా మీద ఒక కొవ్వొత్తి వెలుగుతోంది;

ఒక కొవ్వొత్తి మండుతోంది.

.

(డా. ఝివాగో నవలనుండి సంకలితం)

బోరిస్ పాస్టర్ నాక్

10 February 1890 – 30 May 1960

సోవియట్ రష్యా

 

Boris Pasternak Courtesy: Wikipedia
Boris Pasternak
Courtesy: Wikipedia

.

Winter Night

  It snowed and snowed, the whole world over,

  Snow swept the world from end to end.

  A candle burned on the table;

  A candle burned.

  As during summer midges swarm

  To beat their wings against a flame

  Out in the yard the snowflakes swarmed

  To beat against the window pane

  The blizzard sculptured on the glass

  Designs of arrows and of whorls.

  A candle burned on the table;

  A candle burned.

  Distorted shadows fell

  Upon the lighted ceiling:

  Shadows of crossed arms,of crossed legs-

  Of crossed destiny.

  Two tiny shoes fell to the floor

  And thudded.

  A candle on a nightstand shed wax tears

  Upon a dress.

  All things vanished within

  The snowy murk-white,hoary.

  A candle burned on the table;

  A candle burned.

  A corner draft fluttered the flame

  And the white fever of temptation

  Upswept its angel wings that cast

  A cruciform shadow

  It snowed hard throughout the month

  Of February, and almost constantly

  A candle burned on the table;

  A candle burned.

.

(Excerpt from Dr Zhivago. Tr. By: Bernard Guilbert Guerney)

Boris Pasternak

10 February 1890 – 30 May 1960

Soviet Russian Novelist, Poet

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/search?q=pasternak

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: