కలలోని బాధ.. రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి
.
నేను అడవిలోకి మరలిపోయాను, నా గీతం
చెదరగొట్టబడిన ఆకులతోపాటు చెల్లాచెదరైపోయింది.
ఆ అడవి అంచులకి ఒకసారి నువ్వు వచ్చేవు.
(ఇది నా కల) వచ్చి చూసి చాలసేపు ఆలోచనలోపడ్డావు.
కోరిక బలంగా ఉన్నా, లోపలికి అడుగుపెట్టలేదు.
“ధైర్యం చాలడంలేదు, అతని అడుగులు చాలదూరం దారితప్పేయి…
అతని తప్పు సరిచేసుకుంటె అతనే నన్ను కోరుకుంటాడు”
అన్నట్టు వ్యాకులంగా ఉన్న నీ తలను అయిష్టంగా తాటించేవు.
ఏంతో దూరం లేదు, చాలా దగ్గరగానే నిలబడి ఇదంతా గమనించేను
చెట్లమాటున గుబురుగా పెరిగిన చిట్టిపొదల వెనకనుండి.
నిన్ను పిలవలేకపోయానే అన్న తియ్యని బాధ దిగమింగుకోవలసివచ్చింది
నిను చూశానని నీతో చెప్పాలన్నకోరిక ఇప్పటికీ విడిచిపెట్టదు.
నేనక్కడ దూరంగా ఒంటరిగా ఉన్నానన్నది అసత్యం,
అడవి మేల్కొనడం, నువ్విక్కడ ఉండడమే దానికి నిదర్శనం.
.
Robert Frost
March 26, 1874 – January 29, 1963
అమెరికను కవి
