పళ్ళు కొయ్యవద్దు… ఏడ్నా సెంట్ విన్సెంట్ మిలే

ఎన్నడూ, ఎన్నడూ కొమ్మనుండి పళ్ళు కొయ్యవద్దు
కోసి తట్టల్లోకి ఏరుకో వద్దు.
ప్రేమతో తినేవాడు పండు ఎక్కడ వేలాడితే అక్కడే తినాలి,
కొమ్మలు రెల్లు పోచల్లా అలవోకగా వంగితే వంగనీ
పండు గడ్డిలో మెరుస్తూనో, చెట్టుకి వాడిపోతూనో కనిపించనీ,
ప్రేమతో తినాలనుకున్నవాడు తీసుకోగలిగింది
తనపొట్ట ఎంత పడితే అంత మాత్రమే.
జేబుల్లో ఏదీ దాచుకోకూడదు
పైమీద కండువాల్లోనూ పట్టుకోకూడదు
ఎన్నడూ పళ్ళు చెట్టునుండి కోసి
తట్టల్లోకీ తొట్టెల్లోకీ ఏరుకోకూడదు.
ప్రేమ లేని ఋతువు తెగులు పట్టిన తోటలో
ఖాళీ తోట్టెలతో నిండిన నేలమాళిగ.
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే
February 22, 1892 – October 19, 1950
అమెరికను కవయిత్రి

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

 

.

Never May the Fruit Be Plucked

Never, never may the fruit be plucked from the bough
And gathered into barrels.
He that would eat of love must eat it where it hangs.
Though the branches bend like reeds,
Though the ripe fruit splash in the grass or wrinkle on the tree,
He that would eat of love may bear away with him
Only what his belly can hold,
Nothing in the apron,
Nothing in the pockets.
Never, never may the fruit be gathered from the bough
And harvested in barrels.
The winter of love is a cellar of empty bins,
In an orchard soft with rot.

Edna St. Vincent Millay

 

Poem Courtesy: http://jspecht.org/Lucius/Millay.index.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: