స్మృతిగీతం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

చారెడేసి ఉన్న నీ కనులని నేలలో
భద్రంగా ఎక్కడో రహస్యంగా దాచనీ.
సన్నని నీ వేళ్ళు, మెత్తనైన
అందమైన వింతవన్నెల నీ కురులూ…
ఇవన్నీ ఏదో విధంగా తప్పకుండా
నేలలోని రహస్యమాళిగగుండా పైకి లేస్తాయి;
కానీ, అందుకుకాదు గుండెపగిలి సర్వమూ శూన్యమై
కళ్ళప్పగించి చూస్తూ నేనిక్కడ కూచున్నది;
అందంగా అలంకరించినట్టు నీ చిన్ని ఎముకలను
కప్పిన నీ నునులేత చర్మం
వాతావరణంలోకి పువ్వులా విచ్చుకుంటుందని.

కానీ, నీ గొంతు… నేలపొరల్లో
మంద్రంగా పరిగెత్తే నీటి ఊటలు గాని,
వర్షం పడడానికి ముందు చెట్ల గుబురుల్లో
ఉధృతంగా చేసే గాలి సవ్వడులుగాని
నీటిసానువులలో అడవికోళ్ళ అరుపులుగాని,
పిచ్చుకలు వినిపించే కిచకిచలు గాని,
ఆకసాన్ని బయటపెడుతూ, నిర్దాక్షిణ్యంగా మోడైన
చెట్ల పండుటాకులను కాలువలగుండా తోస్తూ తోస్తూ
పిల్లకాయల పాదాలుచేసే చప్పుళ్ళు గాని …
ఆలోచనలు కమ్ముకున్న నా మనసుకు తృప్తినీయవు.
కారణం, ఆ గొంతులోని మాధుర్యం
ఇక మఋఏ రూపంలోనూ … కొత్తగా
మరొకసారి వినిపించమన్నా వినిపించదు.

నాలుగు దిక్కులా బలంగా ప్రాకి
చేవదేరిన ఆ చెట్టు కాండంలోంచి
తన పూర్వ సారాన్ని ఏమాత్రం కొల్పోకుండా
క్రమం తప్పని సూరుడివెలుగుతో పుష్టిగా
రోజురోజుకీ … అనంతంగా ఎదుగుతూ…
మార్పులకి లోనౌతూ నీ రక్తం ప్రవహిస్తుంది,
మొగ్గై, పువ్వై, విత్తనంగా మారుతుంది.
నువు పాడుకునే రోజులు ముగిసిపోవచ్చు గాని
నీ గొంతులోని సంగీత మాధుర్యాన్ని
నువ్వు మాటాడిన అద్భుతమైన మాటలనీ
వాటి రసాయనిక రహస్యాన్ని
ఈ నేల ఎన్నడూ పునః సృష్టి చెయ్యలేదు.
ఒకసారి ఆ దంతపు భరిణ పగిలిందంటే
అందులోని బంగారు చిలక మరి పలకదు.
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

అమెరికను కవయిత్రి

Edna St. Vincent -Millay
Image Courtesy: http://upload.wikimedia.org

.

Elegy
.

Let them bury your big eyes
In the secret earth securely,
Your thin fingers, and your fair,
Soft, indefinite-colored hair–
All of these in some way, surely,
From the secret earth shall rise;
Not for these I sit and stare,
Broken and bereft completely;
Your young flesh that sat so neatly
On your little bones will sweetly
Blossom in the air.

But your voice–never the rushing
Of a river underground,
Not the rising of the wind
In the trees before the rain,
Not the woodcock’s watery call,
Not the note the white-throat utters,
Not the feet of children pushing
Yellow leaves along the gutters
In the blue and bitter fall,
Shall content my musing mind
For the beauty of that sound
That in no new way at all
Ever will be heard again.

Sweetly through the sappy stalk
Of the vigorous weed,
Holding all it held before,
Cherished by the faithful sun,
On and on eternally
Shall your altered fluid run,
Bud and bloom and go to seed;
But your singing days are done;
But the music of your talk
Never shall the chemistry
Of the secret earth restore.
All your lovely words are spoken.
Once the ivory box is broken,
Beats the golden bird no more.
.
Edna St. Vincent Millay 

February 22, 1892 – October 19, 1950

American Poet 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: