నెల: అక్టోబర్ 2016
-
సానెట్… జాన్ మేస్ ఫీల్డ్, ఇంగ్లీషు కవి
అదలా ఉండొచ్చు; కానీ తెలియనిదాన్ని అలానే ఉండనీ. భూమి మీద మనమందరం సూర్యుడి సేవకులం. నాలోని చైతన్యమంతా సూర్యుడినుండే వస్తుంది, అతని అమృతస్పర్శే సకలజీవులకూ ప్రాణభిక్ష. మనంశూన్యంలో తిరుగుతున్నామంటే అతని శక్తివల్లనే అతని యవ్వనం గ్రీష్మం, మన ఆహారం అతని మగసిరే సౌందర్యం అంటే అతని ముఖంలోకి చూడగలగడమే అతను చీకటి తొలగించి, పూలకు రంగులద్దుతాడు. అతనేమిటో, ఎవరికి తెలుసు? కానీ, మనం అతని సొత్తు అతనిచుట్టూ రోదసిలో ప్రదక్షిణం చేస్తాం, ఏళ్ళకి ఏళ్ళు మనందరం చెట్టుకు…
-
నిరంకుశుడు… చెస్లా మీవోష్, పోలిష్ కవి
[ప్రజల్ని ఎంత అణగదొక్కినప్పటికీ, దయారహితమైన మితిలేని ద్వేషం మనుషుల మనసుల్నీ, జీవనస్ఫూర్తినీ చిదిమెయ్యలేరు. చెస్లావ్ మీహోష్ ప్రత్యక్షంగా అటువంటిది అనుభవించినవాడు. 1951లో దేశాన్ని విడిచి ముందు ఫ్రాన్సుకీ తర్వాత అమెరికాకీ వెళ్ళకముందు రెండవ ప్రపంచ సంగ్రామ కాలంలో వార్సవాలో పోలిష్ ప్రతిఘటన ఉద్యమం లో పనిచేశాడు. ] *** దురాక్రమణకీ, సర్వభక్షణకీ మారుపేరు నువ్వు అల్లకల్లోలంచేసి, ఆవేశాలు రెచ్చగొట్టి కుళ్ళిపోయావు నువ్వు. నువ్వు వివేకుల్నీ, ప్రవక్తల్నీ, నేరగాళ్ళనీ, కార్యశూరుల్నీ ఒకేగాటకట్టి, నజ్జునజ్జు చేస్తావు. నేను నిన్ను సంభోదించడం…
-
నాల్గు వాయువులు…. సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి
ఆకసంలో విసరుతున్న ఓ నాలుగు వాయువులారా, మీరు చూస్తునారుగదా ప్రియురాళ్ళెలా మరణిస్తున్నారో నా ప్రియుడు నాకు విశ్వాసంగా ఉండాలంటే ఏమి చెయ్యాలో సలహా ఇవ్వండి. దక్షిణదిక్కునుండి వీచే గాలి ఇలా అంది: “అతని పెదాలమీద ముద్దుపెట్టకు.” పడమటి గాలి ఇలా అంది: అతని గుండెని లోతుగా గాయపరచు” తూరుపుగాలి ఇలా అంది: “అతన్ని విందునుండి ఉత్తచేతులతో వెళ్ళగొట్టు” ఉత్తరపు గాలి ఇలా అంది: “తుఫానులోకి అతన్ని తోసిపారెయ్” నువ్వు అతనికంటే దుర్మార్గంగా ఉండకపోతే నీ ప్రియుడు నీపట్ల…
-
రెండేళ్ళపాటు… వెల్డన్ కీస్, అమెరికను కవి
ఈ శూన్యస్థితి, దానిమీదే అది బ్రతుకుతుంది: గిరగిరా తిరిగి అరచేతిలోని నీళ్ళలో గీతలు గీస్తుంటుంది, సగం భావాలు అర్థాంతరంగా గాల్లో వేలాడుతుంటాయి, ఆలోచనలు గాజు పగిలినట్లు మనసులోనే భళ్ళున పగుల్తుంటాయి ప్రపంచాన్ని ప్రతిబింబించే తెల్లని కాగితాలు నను మౌనంలోకి త్రోసిన ప్రపంచాన్ని మరింత తెల్లగా చూపిస్తున్నాయి. అలా రెండేళ్ళు గడిచిపోయాయి. మెల్లిగా ముక్కముక్కలుచేసి, నిలువునా చీల్చి, గాయపరచి, పగుళ్ళు వేసి, చిక్కుల్లోపెట్టి, మనసు విరిచిన సంగతులన్నీ నన్ను ఎంతటి క్షీణస్థితికి తెచ్చాయంటే, నేను మండిమండి చివరకి కొడిగట్టే…
-
చెత్తబుట్ట… చార్లెస్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి
ఇది గొప్పవిషయం. నేను ఇప్పుడే రెండు కవితలు రాసేనుగాని, రెండూ నచ్చలేదు. ఈ కంప్యూటర్లో ఒక చెత్తబుట్టఉంది. ఆ కవితల్ని అలా తీసుకువచ్చి చెత్తబుట్టలో పడేసేను. ఇక శాశ్వతంగా కనుమరుగైపోయాయి కాగితం లేదు, చప్పుడు లేదు, కోపమూ లేదు, అనుబంధమూ లేదు, ఇప్పుడు కేవలం శుభ్రంగా ఉన్న తెర నీకోసం ఎదురుచూస్తుంటుంది. ఎప్పుడూ ఇదే మేలైనది సంపాదకులు దాన్ని తిరస్కరించేకంటే మనమే దాన్ని తిరస్కరించడం. ముఖ్యంగా ఇలాంటి వర్షపు రాత్రి రేడియోలో చెత్త సంగీతం వినిపిస్తున్నపుడు. నాకు…
-
చెప్పితీరవలసినది… గుంతర్ గ్రాస్ జర్మన్ కవి
(ఇది రెండు దేశాలమధ్య అగ్రరాజ్యాలు ఆడుకునే ఆట కాదు. వాటి మధ్య చిచ్చుపెట్టి అగ్రరాజ్యాలు చలికాచుకునే అవకాశాన్ని ఇస్తున్న దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. మనప్రయోజనాలకోసం ఎదురుగా ఘాతుకం జరుగుతున్నా మౌనంగా ఊరుకుని, చివరికిమౌనం వీడడంవల్ల, ఎవరికీ ప్రయోజనం చేకూరదన్నది చెప్పకనే చెబుతున్నాడు కవి. ) నేను మౌనంగా ఎందుకున్నాను,చాలా కాలం మనసులో దాచుకుని అందరికీ విశదమూ, రణనీతిలో సాధనచేస్తూవస్తున్నదానిని? యుద్ధం ముగిసిన తర్వాత, బ్రతికి బట్టకట్టగలిగిన మనమందరం మహా అయితే, అధోజ్ఞాపికలుగా మిగిలిపోతాం. ఒక మిషగా చూపించే…
-
యువ కవికి… రొనాల్డ్ స్టూవర్ట్ థామస్, వెల్ష్ కవి
తొలి ఇరవై ఏళ్ళవరకూ నువ్వు ఎదుగుతుంటావు; శారీరకంగా; అంటే, కవిగానే అనుకో, కానీ అప్పటికింకా నువ్వు కవిగా జన్మించవు. తర్వాతి పదేళ్ళలో ఉచితానుచితాలు తెలీకుండా కవిత్వంతో ఆతురంగా చేసే సహవాసంతో మెల్లమెల్లగా నీకు జ్ఞానదంతాలు మొలవడం ప్రారంభిస్తాయి. కవిత్వంతో నీ తొలిప్రేమకలాపాన్ని గంభీరంగా తీసుకుంటావు కానీ, ఆ కవితలతో నీకు అనుబంధాలు పెనవేసుకోవు తీరా నీ ప్రేమంతా స్పందనలేని హృదయరాణి గూర్చి వేదన వెలిబుచ్చడానికి పరిమితమైనపుడు, సిగ్గుపడిపోతావు. నలభైల్లోకి ప్రవేశించగానే అక్కడక్కడ రాతల్లో వెలిబుచ్చిన అందమైన భావాలూ, పదునైన…
-
పదచిత్రాలు… రిచర్డ్ ఆల్డింగ్టన్, ఇంగ్లీషు కవి
1 బాగా ముగ్గి ఘుమఘుమలాడుతున్న పళ్ళునింపుకుని వెనిస్ నగర కాలువల్లో తీరిగ్గా సాగుతున్న గూటిపడవలా ప్రియతమా! సమ్మోహపరుస్తూ నువ్వు, నిరాదరణకుగురైన నా మనోనగరంలో ప్రవేశించావు. 2 అటూ ఇటూ తిరిగి మాయమయే పక్షుల గుంపుల్లా నీలినీలి పొగ అంచెలంచెలుగా పైకిలేస్తోంది. నా ప్రేమ కూడా నీ వంకకు గంతులేస్తోంది … భయంతో వెనుకంజవేస్తూ, మళ్ళీ కొత్తగా చిగురులేస్తోంది 3 చెట్లలో చిక్కుకున్న పొగమంచులో లేతకుంకుమరంగులో సూర్యుడు అస్తమిస్తుంటే పాలిపోయిన ఆకాశంమీద పసుపుగులాబివన్నె చందురునిచందం కనిపిస్తున్నావు నువ్వు నాకు.…
-
మనిషి విశ్వంతో… స్టీఫెన్ క్రేన్, అమెరికను కవి
మనిషి విశ్వంతో అన్నాడు: “ప్రభూ! నేను ఉపస్థితుడనై ఉన్నాను.” “అంతమాత్రంచేత,” పలికింది విశ్వం సమాధానంగా “ఆ వాస్తవం, నీ అస్తిత్వాన్ని కొనసాగించడానికి నాలో ఏ విధమైన నిబద్ధతా కలిగించడంలేదు.” . స్టీఫెన్ క్రేన్ November 1, 1871 – June 5, 1900 అమెరికను కవి . . A Man Said to the Universe . A man said to the universe: “Sir I exist!” “However,” replied the universe,…
-
ఒక హిమ రాత్రి … బోరిస్ పాస్టర్ నాక్, సోవియట్ రష్యా
మంచు కురుస్తూ, కురుస్తూ ఉంది, ప్రపంచమంతటా సృష్టీ ఈ మూలనుండి ఆ మూలకి మంచుతో కప్పబడింది. మేజా మీద ఒక కొవ్వొత్తి వెలుగుతోంది; ఒక కొవ్వొత్తి మండుతోంది. వేసవిలో దీపంచుట్టూ చేరి పురుగులు తమ రెక్కలు కొట్టుకున్నట్టు ఆరుబయట సన్నని తీగసాగిన మంచు పలకలు కిటికీ అద్దానికి కొట్టుకుంటున్నాయి. మంచు తుఫాను గాజు తలుపుమీద బాణాల్లా, శంఖాల్లా అకృతులు రచిస్తోంది. మేజా మీద ఒక కొవ్వొత్తి వెలుగుతోంది; ఒక కొవ్వొత్తి మండుతోంది. వెలుగునిండిన గదిలోపల, కప్పుమీద చిత్రంగా…