మగపురుగులు… వాల్ఝీనా మార్ట్, బెలారూస్ కవయిత్రి

కవులు ఎంతసేపూ సిల్లీగా ప్రేమగురించి వ్రాయడమే గాని, తమ చుట్టూ జరుగుతున్న ఘోరాలని, రొమాంటిసైజ్ చెయ్యకుండా రాయడం ఎలాగో నేర్చుకోవడం లేదు. ఇప్పుడు వస్తున్న కవిత్వమంతా సెంటిమెంట్ కవిత్వమే. వాస్తవానికి కనుచూపు మేరలో ఉండనిదీ, ఎక్కువగా అందరికీ తెలిసిన విషయాలనే నీతులుగా బోధించేదీ. తమదృక్పథంలోనుండి చూడడమే గాని, బాధితుల సమస్యలు అవగాహన చేసుకుని వాటిని నిజాయితీగా ప్రతిబింబించడానికి ప్రయత్నించే సందర్భాలు అరుదు. ఏ పక్షమూ తీసుకొకుండా చరిత్రని రికార్డు చెయ్యడం కవి బాధ్యత. ఇంతకంటే ఎక్కువ చెబితే నేనూ ఆ ఒరవడిలోకి పోతున్నట్టు ఉంటుంది.
(బహుశా) ఏకారణంచేతో ఒక చిన్న పిల్లని తల్లే వేశ్యాగృహానికి అమ్మేస్తే, తల్లిని వెనక్కి వచ్చి తీసుకుపొమ్మని ప్రాధేయపడుతున్న ఆ పిల్ల మానసిక వేదనని ఈ బెలారూస్ కవయిత్రి అద్భుతంగా ఈ కవితలో చిత్రించింది. పైకి నీతిమంతులుగా కనిపించే సమాజంలోని ఉదాత్తమైన పదవులు నిర్వహించే ఉపాధ్యాయులు, అధికారులూ, శాసనాధికారులూ, రాజకీయనాయకులూ, కాలాన్ని వృధాచెయ్యకూడదని మాటాడే పెద్దపెద్ద కంపెనీలోని అధికారులేగాక, త్రాగుబోతులూ, Gay, AIDSగ్రస్తు లైన మగాళ్ళ గురించి వ్రాసిన కవిత. ఇది చదివేక పూర్వ ఆంధ్రప్రదేశ్ గవర్నరు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రీ ఒకాయన గుర్తు రాక మానరు.
 .

మగాళ్ళు కేలండరులోని తేదీల్లా వస్తారు
వాళ్ళు నెలకోసారి వస్తూనే ఉంటారు
అతిపొడవైన మద్యం సీసాల
లోతులు తరచి చూచిన వాళ్ళూ,
భూమ్యాకాసాలకి చెందిన రాజులూ, దివ్యపురుషులూ;
తెగిన గొలుసునుండి రాలిన ముత్యాల్లా
వాళ్ళ స్పర్శకి నేను గడగడలాడుతూ పరిగెడతాను.
వాళ్ళ గుండెచప్పుళ్లు తలుపులు తెరుస్తాయి
వాళ్ళ ఆజ్ఞలధాటికి పాత్రలుసైతం వణుకుతాయి.
చిరుగాలి పెంపుడుకుక్కలా వాళ్ల మొఖం నాకి
వాళ్ళ వందిమాగధులవెంట పరిగెడుతూ, తిరుగుతుంది.
వాళ్ళు నగ్నంగా తయారైనట్టు నన్నూ నగ్నంగా చేసి
జంత్రవాద్యం పట్టుకున్నట్టు చేతుల్లో పట్టుకుంటారు
ఆ సంగీతం అంతులేకుండా ప్రవహిస్తుంది
గుండెలనుండి పాలుకారినట్టు
ఆ శబ్దాలు మనుషులు వినలేనంత కఠోరం
ఆ శబ్దాలు దేవుడు వినలేనంత సరళం
పిల్లలకి నవ్వడం ఎలాగో మప్పే మగ వాళ్ళు
కాలానికి ఎలా నడవాలో చెప్పే మగ వాళ్ళు
టాయ్ లెట్లలో ఇతర పురుషులతో సరసాలాడే మగ వాళ్ళు
మృత్యుహస్తాన్ని అప్పుడే ముద్దుపెట్టుకున్న మగ వాళ్ళు
నన్ను కుర్చీకి కట్టివేసిన నా బెదిరింపులనీ,
పీడకలల్నీ పట్టించుకోని మగవాళ్ళు…
అమ్మా, వాళ్ల పెదాలు నామీద
కాలిపోతున్న విమానాల్లా పడుతున్నాయి
వాళ్ళు బాగా శక్తిమంతులు, సహనవంతులు
ప్రపంచం కూలిపోతే,
తలదాచుకుందికి పరిగెత్తేవారు
వాళ్ళు ఆగి నా కన్రెప్పలు ఊడబెరుకుతున్నారు
అమ్మా! అవి నావే కానక్కరలేదు,
ఎవరివి దొరికితే వాళ్ళవేనే!
అమ్మా! ఒక సారి వెనక్కి రా!
నన్ను రక్షించు. నా కోసం
ఈ కూలిపోయిన విమాన శిధిలాల్లో వెదుకు.
.

వాల్ఝీనా మార్ట్

(b. 1981)

బెలారూస్ కవయిత్రి

  valzhyna-mortPhoto Courtesy:

https://www.poetryfoundation.org/poems-and-poets/poets/detail/valzhyna-mort

.

Men

.

Men arrive like a date on a calendar
they keep visiting once a month
men who’ve seen the bottom
of the deepest bottles
kings of both earth and heaven
and like the pearls from a torn necklace
trembling I scatter at their touch
their heartbeats open doors
vessels respond to their voice commands
and wind licks their faces like a crazy dog
and gallops after their train and roams
they undress me as if undressing themselves
and hold me in their arms like a saxophone
and oh this music these endless blues
like milk from breasts
those notes too high for human ears
those notes too low for gods
men who teach children to laugh
men who teach time how to run
men who love other men in club toilets
men who’ve kissed the hand of death herself
men who’ve never listened to my threats nightmares
which bound me to a chair
mama their lips fall on me
like burning planes
they are powerful patient
and when the world crashes
everyone runs for the shelters
they pause to pluck one of my lashes
mama not even mine
just anyone’s mama
come back
rescue me find me
in this plane wreck
.

(Translated by Franz Wright)

Valzhyna Mort

(b. 1981)

Belarus Poet and Translator

Poem Courtesy:

http://2dayspoem.blogspot.com/2009/01/men.html

“మగపురుగులు… వాల్ఝీనా మార్ట్, బెలారూస్ కవయిత్రి” కి 2 స్పందనలు

  1. అద్భుతమైన కవిత అండి. మీరన్నట్లు బాధిత హృదయాలను ఇంత బాగా ప్రతిఫలించే కవితలు అరుదుగా వస్తాయి.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: