దాడికి వెళ్లిన ఆటగాడు … రాబర్ట్ ఫ్రాన్సిస్, అమెరికను కవి
మన చెడుగుడు (కబడ్డీ) ఆటకి పోలికలున్న Prisoner’s Base ఆట మీద వ్రాసినట్టున్నా, ఈ కబడ్డీ మనలో చాలమందికి పరిచయమే కాబట్టి ఇక్కడ ఇస్తున్నా. ఆటలు వర్ణిస్తూ వచ్చిన అతి తక్కువ కవితల్లో ఇదొకటి.
***
అవసరమైతే ముందుకివెళ్లడానికీ లేకుంటే వెనక్కి మళ్ళడానికి సిద్ధంగా,
తాడుమీద నడిచే వీటివాడిలా అటూ ఇటూ పడకుండా నిలదొక్కుకుంటూ
రెండూ చేతుల వేళ్లూ రెండు వ్యతిరేకదిశల్లో చాచి ఉంచి
క్రిందపడిన బంతి మీదకెగిరినట్టు మునివేళ్ళ మీద గెంతుతూ
లేదా, ఒక అమ్మాయి తాడాట ఆడినట్టు ఆడుతూ, పట్టుకో పట్టుకో అంటూ
కొన్ని అడుగులు అటుపక్కకీ, కొన్ని అడుగులు ఇటుపక్కకీ వేసుకుంటూ