అనువాదలహరి

రాత్రి ప్రశంస… థామస్ లోవెల్ బెడోస్, ఇంగ్లీషు కవి

అయితే మళ్ళీ వచ్చేవన్నమాట, కాలవిహంగాల ముసలివగ్గూ, ఓ రాతిరీ!

మాకూ సూర్యుడికీ మధ్య అడ్డంగా పెద్ద పక్షిలా

నీ శరీరాన్ని వ్యాకోచింపజేసి వెలుతురును మరుగుపరుస్తూ;

చాలనట్టు, నిర్దాక్షిణ్యమన నీ గుండె అంచున చీకట్లలో

మబ్బు రెక్కల దిగువన, పొగమంచు తెగుళ్ళనీ పొదుగుతూ,

తుఫానులకీ, కర్కశమైన హిమపాతాలకి ప్రాణం పోస్తూ,

పగటి గోర్వెచ్చని ఎంద లాలనలు కరువుచేస్తూ…

భీతితో ముడుచుకుపోయిన గుడ్లగూబలు పైకి ఎగబ్రాకిన

లతల ఉయ్యాలల్లో నిను వేడుకుంటూ ప్రార్థనలు చేస్తున్నాయి.

కాంతిహీనమైన ప్రపంచం మీదకి ఒక్క ఉదుటున వాలబోయి

వెనకాడిన కాకోలములా, చెమరించిన కనులతో తృప్తిగా చూస్తావు

నిశ్శబ్దంగా, ఆఖరిగంట చప్పుడు వినిపించే వరకూ నిరీక్షిస్తూ.

వినీలాకాశంలోని నీ సదనాన్ని విడిచిపెట్టి వాలుతావు

ఈ ప్రపంచం మీదకి ఆతురతపడుతున్న గోళ్ళతో,

కుక్షిలో కాలాన్నీ, మృత్యువునీ, జీవాన్నీ సమాధిచేయడానికి.

.

థామస్ లోవెల్ బెడోస్

(30 June 1803 – 26 January 1849)

ఇంగ్లీషు కవి

To Night

So thou art come again, old black-winged night,
Like an huge bird, between us and the sun,
Hiding, with out-stretched form, the genial light;
And still, beneath thine icy bosom’s dun
And cloudy plumage, hatching fog-breathed blight
And embryo storms, and crabbéd frosts, that shun
Day’s warm caress. The owls from ivied loop
Are shrieking homage, as thou cowerest high;
Like sable crow pausing in eager stoop
On the dim world thou gluttest thy clouded eye,
Silently waiting latest time’s fell whoop,
When thou shalt quit thine eyrie in the sky,
To pounce upon the world with eager claw,
And tomb time, death, and substance in thy maw.

Thomas Lovell Beddoes

(30 June 1803 – 26 January 1849)

English Poet, Physician and Dramatist

Poem Courtesy: http://2dayspoem.blogspot.com/2009/01/to-night.html

%d bloggers like this: