మన చిత్రమైన మానసిక స్థితిని పట్టిచ్చే కవిత ఇది. కొన్ని వస్తువులు పోగొట్టుకుంటాం. వాటిని తిరిగి సంపాదించడానికి తెగ వెతుకులాడతాం. ఈ వెతుకులాటలో పొరపాటున ఏదైనా కొత్త వ్యాపకం దొరికితే, ముందు చికాకుపడినా, కొంతసేపటికి, మనం వెతుకుతున్న లక్ష్యం మరిచిపోయి, ఈ వ్యాపకానికి అలవాటుపడిపోతాం.
బేగల్ అన్నది ముందు పులియబెట్టి, తర్వాత వేచి, గట్టిగా, గారెలూ, చేగోడీల్లా గుండ్రంగా, కానీ పలచగా చుట్టలుచుట్టి తయారుచేసే వంటకం.
.
గాలికి దొర్లిపోతున్న బేగల్ ని
పట్టుకుందికి నిలబడ్డాను.
దాన్ని క్రిందపడేసినందుకు
అదొక అపశకునంలా భావించి
కోపంతో నన్ను నేను తిట్టుకున్నాను.
అది మరీ వేగంగా దొర్లసాగింది
దాని వెనకే నేనూ పరిగెత్తుతున్నాను
పళ్ళు బిగబట్టి, బాగా క్రిందకి వంగి.
ఎప్పుడు దొర్లిపోయానో నాకే తెలియదు
కాని వీధిలో అలా దొర్లుతున్నాను
తల క్రిందకీ కాళ్ళు మీదకీ పెట్టి
బేగల్ వెనక మరొక బేగల్ లా
ఒకదాని వెనక మరో పిల్లిమొగ్గ వేసుకుంటూ.
చిత్రంగా, నాకు ఇది ఎంతో బాగుంది.
.
డేవిడ్ ఇగ్నతోవ్
(February 7, 1914 – November 17, 1997)
అమెరికను కవి
.
Image Courtesy: https://www.poets.org/poetsorg/poet/david-ignatow
స్పందించండి