నా తోడివారిలో నేను చెడ్డవాడిగా పేరుబడ్డాను.
అయినాసరే, ఎవరూ దాసులు కాగోరని,
ఆలోచనలు ఏకాగ్రతను జ్ఞానోదయం కంటే
కలలలో విశృంఖలతవైపు నడిపించే ఆనందాలని
నా అక్కున చేర్చుకుందికి చొరవచూపించాను.
అభిమతాల తేరు నా ఆలోచనలకు ఆగింది,
అగణితమైన తన సమ్మోహనకళలనీ ప్రదర్శిస్తూ
‘కళ ‘ తలవంచింది; శాస్త్రవిజ్ఞానం విస్తృతమైన
దాని అనురూపత కొనియాడింది అంతరాత్మ పరిణతినీ,
నడవడినీ సందేహిస్తూ; సూర్యుని వెలుగు కిరణం
నా ఆలోచనలు గోళాల చుట్టూ తిరిగేలా ప్రోత్సహించింది.
చంద్రసదృశమైన దివ్యాకృతులక్రింద నా కనులు మూతబడ్డాయి;
నేనిపుడు స్పృహలేని దివ్యలోకాల్లో సంచరిస్తున్నాను.
.
సామ్యూల్ గ్రీన్ బెర్గ్
(December 13, 1893 – August 16, 1917)
ఆస్ట్రియన్- అమెరికన్ కవి, కళాకారుడూ