ఆసుపత్రినుండి ఉత్తరాలు… మైకేల్ రైయన్, అమెరికను కవి

వార్డులో మంచాలు, చీకటిలో
దయ్యపు పడవల్లా తేలుతున్నాయి.
నా తలదిక్కున ఉన్న చిరు దీపం
లైట్ హౌస్ అయినట్టూ, అందులో ఒకపొట్టి మనిషి
నావికుడి టోపీ పెట్టుకుని సముద్రం మీద
చిన్ననాటిసాహసగాథలు చెబుతున్నట్టూ ఊహిస్తున్నాను.
ఆ పొట్టిమనిషి ఎవరో కాదు, నేనే.
బహుశా నా దగ్గర “ఓల్డ్ సాల్ట్” అన్న కుక్క
నా అరచేతిని నాకుతూ, వర్తులాకారపు
మెట్లమీద నిరంతరం పరిగెత్తేదొకటి ఉండుంటుంది.
బహుశా అది ‘పాపం ‘ అంత గట్టిగా కాటువేస్తుందేమో.
ఓడలు నీటిలోని రాతిగట్టులు ఢీకున్నట్టూ,
వాటి అడుగుభాగం ముక్కచెక్కలైనట్టూ
చెల్లాచెదరైన సిబ్బంది గొంతులు
‘మమ్మల్ని రక్షించండి, ఎవరైనా రక్షించండి
బాబూ ఎవరైనా రక్షించండి’ అని అరుస్తున్నట్టూ
కలగంటాను. దరిదాపులో ఎవరూ ఉండరు.
చివరకి నేనుకూడా. కాన్వాసు మంచం పట్టీలు
నా పిర్రల్ని కోస్తుంటే, భయపడుతూ నిద్రలేస్తాను.
రాత్రి డ్యూటి చేసిన నర్సు, రోగుల్ని పరామర్శిస్తూ
నువ్వు రాత్రి  ‘హారన్ మోగించినట్టు గురకపెట్టే’ వంది.

*
రాత్రిపూట ఏవీ బయటకి కదలవు.
ప్రయోగాలకోసం
క్రింద బంధించిన
చిన్న చిన్న జంతువులు, అర్థంలేని పుకార్లూ
స్పానిష్ స్వీపరు శుభ్రం చేస్తున్నపుడు నాకు
అంగుళాలదూరంనుండి పోయే చీపురూ తప్ప;
వార్డులో మా మధ్య తప్పులు చెయ్యడానికీ,
ఆవేశంవచ్చినపుడు భుజాలు కదపడానికీ
సరిపడ్డ సందు ఉంది.
మేము సరిగ్గా “శవాలగది”కి పైనే ఉన్నాము.
క్రింద పెట్టెలతో ఉన్న మంచుకి
మా గది మరీ చల్లగా ఉంటుంది.
బహుశా జంతువులకి కూడ తెలుసనుకుంటాను
ఎవరైనా బందీగా ఉండి ఉండి, ఏమీ తోచక
చివరకి ఏడుస్తారని; అందుకే అవి
వాటిని ఉంచిన బోను ‘తీగెవల’ తలుపుల్ని
తలతో కొట్టి పళ్ళతో పీకుతుంటాయి,
అరుస్తాయి, పంజాతో ఎక్కడానికి ప్రయత్నిస్తాయి.
కాపలాదారుడికీ ఈ విషయం తెలుసు.
అందుకే బరువైన ఆ చీపురుని నడుముకి ఆన్చి
సంప్రదాయంగా వచ్చిన అలవాటు ప్రకారం
చేతితో శిలువగుర్తు వేసుకుని
మమ్మల్ని మా మంచంపట్టీలమీద
ఇంకా వెచ్చగా, ఒంటరితనంతో దిగులుగా
భయంగా ఉన్న మా శరీరాలతో
వణుకుతూ ఉండమని విడిచి వెళిపోతాడు.
*
నా బుర్రలో రావణుడికోటలాంటి
తోట ఒకటి ఉంది.
అందులో నేను తప్పిపోయానని
అనుకుంటున్నాను.
వాళ్ళే నా కోసం వెతుకుతుంటారు అప్పుడప్పుడు.
నాకు నా కలలంటే ఇష్టం లేదు.

నేనెక్కడ దాక్కున్నానన్న విషయమై
ఇద్దరు నర్సులు వాదించుకుంటున్నారు.
నేను ఒక పొదమాటునుండి వింటున్నాను.
ఒక కొమ్మ బిగువుగా కోస్తోంది;
మరొకటి గుచ్చుకుంటోంది.
ఆ రెండింటినీ ఎక్కడికో విసిరెద్దామనుకుంటున్నాను.

వాళ్ళిద్దరూ ఇక్కడ
నవ్వులాటగా ఉందనుకుంటున్నారు.
ఆ నవ్వు డీజలు ఇంజనులా ఉంది.
నేను బయటకు రాను, నాకు బద్ధకం.
అప్పుడు మీరు సూదుల్ని ఇష్టపడడం ప్రారంభిస్తారు
మీకు పిచ్చెక్కితే బాగుణ్ణనుకుంటారు.
.
మైకేల్ రైయన్.

(born 1946)

అమెరికను కవి

 

 

Letters from an Institution
.

The ward beds float like ghost ships
in the darkness, the nightlight
above my bed I pretend is a lighthouse
with a little man inside who wears
a sailor cap and tells good old stories
of the sea. The little man is me.
Perhaps I have a dog called Old Salt
who laps my hand and runs endlessly
down the circular stairs.
Perhaps he bites like sin.
I dream of ships smashing the reefs,
their bottoms gutting out,
the crews’ disembodied voices screaming
Help us help us help somebody please
and there is no one there at all
not even me. I wake up nervous,
Old Salt gnawing my flesh. I wake up nervous,
canvas bedstraps cutting my groin.
The night nurse, making the rounds,
says I bellow in sleep like a foghorn.
*

Nothing moves at night
except small animals
kept caged downstairs
for experiments, going
bullshit, and the Creole
janitor’s broom whisking
closer by inches.
In the ward, we all
have room for errors and elbows
to flail at excitement.
We’re right above the morgue;
the iceboxes make our floor
cold. The animals seem to know
when someone, bored with holding
on, gives out: they beat
their heads and teeth
against the chicken wire
doors, scream and claw
The janitor also knows.
He props his heavy broom
against his belt, makes
a sign over himself
learned from a Cajun,
leaves us shaking
in our bedstraps
to drag the still
warm and nervous body
down from Isolation.
*

I have a garden in my brain
shaped like a maze
I lose myself
in, it seems. They only look for me
sometimes. I don’t like my dreams.

The nurses quarrel over where I am
hiding. I hear from inside
a bush. One is crisp
and cuts; one pinches. I’d like to push
them each somewhere.

They both think it’s funny
here. The laughter sounds like diesels.
I won’t come out because I’m lazy.
You start to like the needles.
You start to want to crazy.

.
Michael  Ryan

(born 1946)

American Poet

poem courtesy:
https://www.poetryfoundation.org/poems-and-poets/poems/detail/48587

 

.

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: