ఉత్తరాలిప్పటికీ వస్తుంటాయి “శ్రీమతి వాల్టర్స్ కి” అంటూ
బహుశా, కొన్నాళ్ళ క్రిందట ఆవిడ ఈ ఇంట్లో
మా లాగే, నివసించి ఉంటుంది. అన్నీ చిన్న విషయాలే…
చుట్టజుట్టిన కాలెండరు, ఆమె ఇక్కడ ఉండి ఉంటే
నేను తుప్పు పట్టిన మేకు తీసేసినచోట వేలాడుతూ ఉండేది,
కేటలాగులూ, ఆమె చెల్లించని చివరి గేస్ బిల్లూ…
అన్నిసార్లూ “శ్రీమతి G వాల్టర్స్” అనే సంబోధన.
నా మట్టుకు ఈ ఇంటి ఆత్మలో స్త్రీత్వం కనిపిస్తుంది
నిరంతరం దాని గుసగుసలువింటుంటే నాకు అనిపిస్తుంది:
ఆమె ఎక్కడికీ వెళ్ళనట్టు ఉత్తరాలు రప్పించుకుంటోందని.
వాటిమీద నేను ప్రతివారం రాస్తుంటాను, అపనమ్మకంతోనే,
“ఇక్కడ నివసించడం లేదు. చిరునామా తెలీదు.” అని.
.
ఫ్రాంక్ ఓమ్స్ బీ
జననం 1947
నార్దర్న్ ఐర్లండ్ కవి
స్పందించండి