ఒక ఏడాదిపాటు నిశ్శబ్దంలో మునిగిపోవడంతో
కప్పలు ఎలా అరుస్తాయో మరిచిపోయాను
ఎవ్వరూ అంతగా నడవని ఈ దారిలో నేను ఈ
సాయంవేళ నడవడానికి సాహసించి ఉండకూడదు.
అందం నాకోసం దారికాసింది. లేకుంటే, నాకూ
కప్పల బెకబెకలకీ మధ్య ఎవరు నడుస్తారు?
ఓ నిసర్గ సౌందర్యమా! నన్ను పోనీ,
నేనొక పిరికి మహిళను, ఒక ఇంటి నుండి
వేరొక ఇంటికి పోతున్న దానను!
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే
(February 22, 1892 – October 19, 1950)
అమెరికను కవయిత్రి

స్పందించండి