గాడిదలతో స్వర్గానికి … ఫ్రాన్సిస్ జేమ్స్, ఫ్రెంచి కవి

ప్రభూ! నేను నీ కడకు రావలిసిన రోజు,
అది దుమ్మూ ధూళీలేని త్రోవ కావాలని ప్రార్థిస్తున్నాను.
భూమి మీద నా ప్రయాణాలలో నేను ఎన్నుకున్నట్టే,
పట్ట పగలు చుక్కలు స్వచ్చంగా ప్రకాశించే
స్వర్గానికి ఏ త్రోవలో వెళ్ళాలో నన్ను ఎంచుకుందికి అనుమతించు.
నేను నా చేతికర్రపట్టుకుని నచ్చినత్రోవలో వెళ్తాను
వెళుతూ, నా మిత్రులైన గాడిదలకు ఇలా చెప్తాను:
“మిత్రులారా, నేనూ, ఫ్రాన్సిస్ జేమ్స్ ని. నేను స్వర్గానికి బయలుదేరాను.
(ఎందుకంటే, దేవునిప్రేమతో నిండిన నేలమీద నరకమెక్కడిది?)
అంతే కాదు, “చెవులు విదిలిస్తూనో,
తల తాటిస్తూనో ముసురుకునే ఈగల్నీ, దోమల్నీ విదిలించుకునే
ప్రాణ మిత్రులారా, రండి నీలాకాసపు దారులంటపోదాం…”

ప్రభూ నను వీటితో నీ స్వర్గంలోకి రానీ.
తలలు ఎంతో వినయంగా వాల్చే ఈ చతుష్పాదులు
వాటి చిన్ని కాళ్ళని దగ్గరగా జతగూర్చి
నీ అనుకంపని కోరుతూ మహా వినయపడి నిలుచుంటాయి.
వాటి వీపున వెదురుతట్టలు మోస్తున్నవీ,
నాటువైద్యుల మూలికలు, మందులూ మోసేవీ
తూలికలచీపుళ్ళూ, వంటపాత్రలు మోసేవీ
ఒరుసుకునే నీటిపీపాలబరువుకి గూనిగా నడిచేవీ,
చూలుతో ఉండి నడవలేక తొట్రుపడే గాడిదలూ
వాటి వెనుకభాగాన లేచిన గాయాలనూ కురుపులనూ
కప్పడానికి వేసిన అలంకరణలపై గుంపులు గుంపులుగా
మూగి అదను చూసి హింసించి గోలచేసే ఈగలతో బాధపడే
లక్షల జీవుల వెనుక నేను ప్రవేశిస్తాను.
ప్రభూ, నన్ను ఈ గాడిదలతోనే లోనికి అనుమతించు.
అందమైన పిల్లల బుగ్గల్ని పోలిన పండ్లు వేలాడే
చిక్కని నీడలతో నిండిన సెలయేటి ప్రశాంత తీరాలకు
దేవదూతలు మాకు త్రోవ చూపింతురుగాక!
ఆ స్వర్లోకపు ఆత్మల సమూహంలో
నీ దివ్యజలాలలోకి తొంగి చూస్తూ
వీటిని సరిపోలుతూ నన్నూ ఒకగాడిదని కానిమ్ము.
శాశ్వతమైన నీ ప్రేమామృతపు స్వచ్చతలో
వాటి దైన్యమూ, పేదరికమూ స్పష్టంగా అగుపించుగాక!
.
(ఫ్రెంచి నుండి అనువాదం: రిచర్డ్ విల్బర్)
.
ఫ్రాన్సిస్ జేమ్స్,
2 December 1868, – 1 November 1938
ఫ్రెంచి కవి.

.

A Prayer to Go to Heaven with the Donkeys

When I must come to you, O my God, I pray

It be some dusty-roaded holiday,

And even as in my travels here below,

I beg to choose by what road I shall go

To Paradise, where the clear stars shine by day.

I’ll take my walking-stick and go my way,

And to my friends the donkeys I shall say,

“I am Francis Jammes, and I’m going to Paradise,

For there is no hell in the land of the loving God.”

And I’ll say to them: “Come, sweet friends of the blue skies,

Poor creatures who with a flap of the ears or a nod

Of the head shake off the buffets, the bees, the flies . . .

“Let me come with these donkeys, Lord, into your land,

These beasts who bow their heads so gently, and stand

With their small feet joined together in a fashion

Utterly gentle, asking your compassion.

I shall arrive, followed by their thousands of ears,

Followed by those with baskets at their flanks,

By those who lug the carts of mountebanks

Or loads of feather-dusters and kitchen-wares,

By those with humps of battered water-cans,

By bottle-shaped she-asses who halt and stumble,

By those tricked out in little pantaloons

To cover their wet, blue galls where flies assemble

In whirling swarms, making a drunken hum.

Dear God, let it be with these donkeys that I come,

And let it be that angels lead us in peace

To leafy streams where cherries tremble in air,

Sleek as the laughing flesh of girls; and there

In that haven of souls let it be that, leaning above

Your divine waters, I shall resemble these donkeys,

Whose humble and sweet poverty will appear

Clear in the clearness of your eternal love.

(French: trans. Richard Wilbur)

Francis Jammes

2 December 1868,  – 1 November 1938

Fench poet

poem courtesy: http://www.ronnowpoetry.com/contents/jammes/PrayertoGotoHeaven.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: