రోజు: సెప్టెంబర్ 9, 2016
-
గాడిదలతో స్వర్గానికి … ఫ్రాన్సిస్ జేమ్స్, ఫ్రెంచి కవి
ప్రభూ! నేను నీ కడకు రావలిసిన రోజు, అది దుమ్మూ ధూళీలేని త్రోవ కావాలని ప్రార్థిస్తున్నాను. భూమి మీద నా ప్రయాణాలలో నేను ఎన్నుకున్నట్టే, పట్ట పగలు చుక్కలు స్వచ్చంగా ప్రకాశించే స్వర్గానికి ఏ త్రోవలో వెళ్ళాలో నన్ను ఎంచుకుందికి అనుమతించు. నేను నా చేతికర్రపట్టుకుని నచ్చినత్రోవలో వెళ్తాను వెళుతూ, నా మిత్రులైన గాడిదలకు ఇలా చెప్తాను: “మిత్రులారా, నేనూ, ఫ్రాన్సిస్ జేమ్స్ ని. నేను స్వర్గానికి బయలుదేరాను. (ఎందుకంటే, దేవునిప్రేమతో నిండిన నేలమీద నరకమెక్కడిది?) అంతే…