అది నీకు దూరమైతే చెప్పు. *
బాల్టిక్ చిరు కెరటాలని దాటుకుని వచ్చి
డెన్మార్క్ క్షేత్రాల్ని గడచి, బీచ్ తోటలనుదాటి, సముద్రంవైపుకి తిరిగితే,
అక్కడ త్వరలోనేమంచుతో తెల్లబడబోయే లాబ్రడార్ కనిపిస్తుంది.
నగరాలకీ, అక్కడ రాజమార్గాలమీద తళుకుమనే వెలుగులకీ భయపడి
ఏకాంతద్వీపాలగురించి కలగనే నీకు,
కరిగి నీలివర్ణంలోకి మారే సెలయేటి నీటితో,
జింకలూ కారిబూల కాలిజాడలతోనిండిన
సుదీర్ఘమైన మరుభూమిగుండా తిన్నని త్రోవ, ఎంతదూరం అంటే,
సియెర్రా వరకూ, విడిచిపెట్టినబంగారుగనులవరకూ కనిపిస్తుంది.
పక్కన సాక్రమెంటో నది దట్టంగా, విచ్చలవిడిగా పెరిగిన
ముళ్ళతో నిండిన ఓక్ చెట్లతో కూడిన పర్వతాల నడుమకి తీసుకుపోతుంది.
అంతే, అది దాటితే ఒక నీలగిరివృక్షాల తోట, అక్కడ నే కనిపిస్తాను.
.
చెస్లా మీవోష్,
30 June 1911 – 14 August 2004
పోలిష్ కవి 1980 Nobel Prize
* (ఈ త్రోవ తక్కువలో తక్కువ ఆకాసమార్గాన కనీసం 8వేల మైళ్ళదూరమూ, 18 గంటల ప్రయాణమూ)

Photo Courtesy: Wikipedia
స్పందించండి