నీ రోజులు ముగిసిపోయాయి… లార్డ్ బైరన్, ఇంగ్లీషు కవి

నీ రోజులు ముగిసిపోయాయి… నీ కీర్తి మొదలయింది
ఇకనుండి ఈ దేశపు గీతాలు 
తమ అభిమాన పుత్రుడి విజయాలనీ
అతని కరవాల విహారాన్నీ కీర్తిస్తాయి
అతని వీర గాధలూ, జయించిన సామ్రాజ్యాలూ
అతను పునరుద్ధరించిన స్వాతంత్య్రాన్నీ.

నువ్వు రాలిపోయినా, మేము స్వేఛ్ఛగా
జీవించినంతకాలమూ నీకు మరణం లేదు!
నీ శరీరంలోంచి పారిన నెత్తుటేరులు
నేలలోకి ఇంకడానికి విముఖతచూపించాయి.
అవి మా రక్తనాళాల్లో ప్రవహిస్తున్నాయి,
నీ సాహసం మాకు ఊపిరిగా నిలబడుతుంది! 

నీ పేరు, ముందుకి ఉరుకుతున్న మా సైన్యానికి
రణన్నినాదంగా ప్రతిధ్వనిస్తుంది!
నీ మరణగాధ, మా యువగళాలలో
బృందగానంగా మారుమోగుతుంది.

నీకై దుఃఖించడం నీ కీర్తికి కళంకం
నీ గురించి మేమెన్నడూ వగవము.
.
లార్డ్ బైరన్
22 January 1788 – 19 April 1824
ఇంగ్లీషు కవి

Image Courtesy: http://upload.wikimedia.org
George Gordon Lord Byron     Image Courtesy: http://upload.wikimedia.org

 

.

Thy days are done, thy fame begun;
Thy country’s strains record
The triumphs of her chosen Son,
The slaughter of his sword!
The deeds he did, the fields he won,
The freedom he restored!

Though thou art fall’n, while we are free
Thou shalt not taste of death!
The generous blood that flow’d from thee
Disdain’d to sink beneath:
Within our veins its currents be,
Thy spirit on our breath!

Thy name, our charging hosts along,
Shall be the battle-word!
Thy fall, the theme of choral song
From virgin voices pour’d!
To weep would do thy glory wrong:
Thou shalt not be deplored.

.

Lord Byron

22 January 1788 – 19 April 1824

English Poet

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: