అంకితం… రాబర్ట్ లూయీ స్టీవెన్సన్, స్కాటిష్ కవి
ఇదే నీకు నా మొదటిదీ కడసారిదీ బహుమతి
ఈ చిన్ని కవితాగుచ్చాన్ని అంకితం ఇస్తున్నాను.
నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆస్తి ఈ కవితలే
వాటిని ఉన్నవున్నట్టుగా నీకు సమర్పిస్తున్నాను.
నేను మత్తులో లేకుండా నిజం చెబుతున్నాను,
నీ దృష్టికి వీటిని ఎప్పుడో తీసుకురావలసింది
తీసుకువచ్చి, నా మనసుతో నింపిన ఈ కీర్తనలని
నువ్వు మెచ్చుకుంటే ఎంతో బాగుండేది
ఈ దయలేని ప్రపంచం అంతా, ముక్త కంఠంతో
నాకూ, నా కవితలకూ,
ఎంతకీ ఆగని కరతాళధ్వనులతో
గొప్ప ప్రశంసలు కురిపించే కంటే.
నా ప్రేమకి ఇక్కడ మంగళం పాడుతున్నాను.
ఇదే నా ప్రేమకి సమాధి, మృత్యుల్లేఖనమూను.
ఇక్కడతో దారి రెండుగా చీలిపోతుంది.
నేను నా త్రోవన, నీకు చాలా దూరంగా నిష్క్రమిస్తాను.
.
రాబర్ట్ లూయీ స్టీవెన్సన్
(13 November 1850 – 3 December 1894)
స్కాటిష్ కవి