నేను అతిసామాన్యంగా జీవించడం నేర్చుకున్నాను… అనా అఖ్మతోవా, రష్యను కవయిత్రి

నేను వివేకంగా, అతిసామాన్యంగా జీవించడం నేర్చుకున్నాను:
ఆకాశం వంక చూడడం, దేవుణ్ణి ప్రార్థించడం,
అతివేలమయిన నా కష్టాలు మరిచిపోడానికి
చీకటిపడకముందే ఎక్కువదూరం అలా నడవడం.
కొండవాలులో అంట్రింత చెట్లు గలగలలాడుతున్నపుడూ,
సంజెరంగులోని బెర్రీపళ్ళు గుత్తులుగా వాలినపుడూ
నేను ఆనందంగా కవితలు అల్లుకుంటాను…
నశ్వరమైన జీవితంగురించీ, సౌందర్యం, మృత్యువుగురించీ.

నేను ఇంటికి తిరిగి వస్తాను. మెత్తని బొచ్చుగల పెంపుడుపిల్లి
నా అరచేతిని నాకుతుంది. ముద్దుగా కులుకుతుంది.
చెరువుగట్టుననున్న రంపపు మిల్లు పొగగొట్టం కొస
క్రింద పొయ్యిలో చెలరేగుతున్న మంటలకి ఎర్రగా కనిపిస్తోంది.
విశాలంగా పరుచుకున్న నిశ్శబ్దాన్ని, ఉండీ ఉడిగీ
మిద్దెమీద వాలుతున్న కొంగల అరుపులు భంగపరుస్తున్నాయి.
మీరు అప్పుడు నా తలుపు తట్టినా
నాకు వినిపించకపోవచ్చు.
.
అనా అఖ్మతోవా

(23 June  1889 – 5 March 1966)

రష్యను కవయిత్రి

Anna Akhmatova

I taught myself to live simply…

.

I taught myself to live simply and wisely,
to look at the sky and pray to God,
and to wander long before evening
to tire my superfluous worries.
When the burdocks rustle in the ravine
and the yellow-red rowan berry cluster droops
I compose happy verses
about life’s decay, decay and beauty.
I come back. The fluffy cat
licks my palm, purrs so sweetly
and the fire flares bright
on the saw-mill turret by the lake.
Only the cry of a stork landing on the roof
occasionally breaks the silence.
If you knock on my door
I may not even hear.

.

Anna Akhmatova

(23 June  1889 – 5 March 1966)

Russian Modernist Poetess

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: