వాయిదా పడిన కల ఏమవుతుంది?
ఎండబెట్టిన ద్రాక్షలా
ఎండిపోయి ఒరుగు అయిపోతుందా?
పుండులా సలిపి సలిపి
తర్వాత రసి కారుతుందా?
కుళ్ళిపోయిన మాంసంలా కంపుకొడుతుందా?
ముదురుపాకంతో చేసిన మిఠాయికి
పైన పంచదారలా పేరుకుంటుందా?
బహుశా భారీ బరువుకి
అది క్రిందకి సాగిపోతుందేమో!
లేక, కొంపతీసి విస్ఫోటిస్తుందా?!
.
లాంగ్స్టన్ హ్యూజ్
(February 1, 1902 – May 22, 1967)
అమెరికను కవి

Dream Deferred
.
What happens to a dream deferred?
Does it dry up
Like a raisin in the sun?
Or fester like a sore–
And then run?
Does it stink like rotten meat?
Or crust and sugar over–
like a syrupy sweet?
Maybe it just sags
like a heavy load.
Or does it explode?
.
Langston Hughes
(February 1, 1902 – May 22, 1967)
American
Poem Courtesy: http://100.best-poems.net/dream-deferred.html
స్పందించండి