అనువాదలహరి

చరమ శ్లోకం… కోలరిడ్జ్, ఇంగ్లీషు కవి

నిలు బాటసారీ, క్రైస్తవుడా! నిలు, దేవుని బిడ్డా
సున్నితహృదయుడవై చదువు. ఈ మట్టిక్రింద
ఒక కవి పరుకున్నాడు, కాదు, ఒకప్పుడు అలా కనిపించేవాడు
ఓహ్! ఒక్కసారి S T C కోసం ప్రార్థన చెయ్యి:
అతను అనేక సంవత్సరాలు కష్టపడి కష్టపడి
బ్రతుకులో చావు ఉచూసేదు; చావులో బ్రతుకుచూడనీ అని.
ప్రశంసకి కరుణనీ, కీర్తికి క్షమాపణనీ
క్రీస్తుద్వారా అర్థించాడు. నువ్వూ అదే ప్రార్థించు.
.
శామ్యూల్ టేలర్ కోలరిడ్జ్
21 October 1772 – 25 July 1834
ఇంగ్లీషు కవి

.

Epitaph

Stop, Christian passer-by: Stop, child of God,
And read, with gentle breast. Beneath this sod
A poet lies, or that which once seem’d he –
O, lift one thought in prayer for S. T. C. –
That he who many a year with toil of breath
Found death in life, may here find life in death:
Mercy for praise – to be forgiven for fame –
He ask’d, and hoped through Christ. Do thou the same.

.

Samuel Taylor Colerdige

21 October 1772 – 25 July 1834

English Poet

Poem Courtesy:

http://2dayspoem.blogspot.com/2007/05/epitaph.html

 

ఎన్ని రహస్యాలు దాచుకుంటామో… రిల్కే, ఆస్ట్రియన్ కవి

మనం ఎన్ని రహస్యాలు దాచుకుని ఉంటామో
ఎన్ని పువ్వులకి చెప్పుకుని ఉండి ఉంటామో,
అందుకే అందమైన పొదరిళ్లలో అవి
మన ఆవేశాలెంతగాఢమో తెలియజేస్తుంటాయి

మనకష్టాలన్నీ చెప్పుకుంటామని
చుక్కలన్నీ నివ్వెరపోతాయి లోలోపలే. ఇక,
అత్యంత సమర్థవంతమైనది మొదలుకుని
అతి దుర్బలమైనదాని వరకూ ఏదీ భరించలేదు

మన నిలకడలేని చిత్తవృత్తులూ,
మన తిరస్కారాలూ, రోదనలూ—
ఒక్క అలుపెరుగని రాతబల్లా..
అది పోయినపుడు, పడకబల్లా మినహాయిస్తే.

.

రిల్కే

(4 December 1875 – 29 December 1926)

ఆస్ట్రియను కవి

.

How Many Secrets We Harbour …

.

How many secrets we harbour
and have told the flowers,
so that in their graceful bowers
they tell us how strong is our ardour.

The stars are confused to their core
that all our problems we tell.
From the strongest to the most frail
none can put up any more

with our variable mood,
our revolts and our cries -,
except the untiring table’s wood
and the bed (when the table’s died).

. (Trans:  Brian Cole)

Rainer Maria Rilke

(4 December 1875 – 29 December 1926)

Bohemian- Austrian Poet

Poem Courtesy: http://2dayspoem.blogspot.com/search/label/Brian%20Cole

మగపురుగులు… వాల్ఝీనా మార్ట్, బెలారూస్ కవయిత్రి

కవులు ఎంతసేపూ సిల్లీగా ప్రేమగురించి వ్రాయడమే గాని, తమ చుట్టూ జరుగుతున్న ఘోరాలని, రొమాంటిసైజ్ చెయ్యకుండా రాయడం ఎలాగో నేర్చుకోవడం లేదు. ఇప్పుడు వస్తున్న కవిత్వమంతా సెంటిమెంట్ కవిత్వమే. వాస్తవానికి కనుచూపు మేరలో ఉండనిదీ, ఎక్కువగా అందరికీ తెలిసిన విషయాలనే నీతులుగా బోధించేదీ. తమదృక్పథంలోనుండి చూడడమే గాని, బాధితుల సమస్యలు అవగాహన చేసుకుని వాటిని నిజాయితీగా ప్రతిబింబించడానికి ప్రయత్నించే సందర్భాలు అరుదు. ఏ పక్షమూ తీసుకొకుండా చరిత్రని రికార్డు చెయ్యడం కవి బాధ్యత. ఇంతకంటే ఎక్కువ చెబితే నేనూ ఆ ఒరవడిలోకి పోతున్నట్టు ఉంటుంది.
(బహుశా) ఏకారణంచేతో ఒక చిన్న పిల్లని తల్లే వేశ్యాగృహానికి అమ్మేస్తే, తల్లిని వెనక్కి వచ్చి తీసుకుపొమ్మని ప్రాధేయపడుతున్న ఆ పిల్ల మానసిక వేదనని ఈ బెలారూస్ కవయిత్రి అద్భుతంగా ఈ కవితలో చిత్రించింది. పైకి నీతిమంతులుగా కనిపించే సమాజంలోని ఉదాత్తమైన పదవులు నిర్వహించే ఉపాధ్యాయులు, అధికారులూ, శాసనాధికారులూ, రాజకీయనాయకులూ, కాలాన్ని వృధాచెయ్యకూడదని మాటాడే పెద్దపెద్ద కంపెనీలోని అధికారులేగాక, త్రాగుబోతులూ, Gay, AIDSగ్రస్తు లైన మగాళ్ళ గురించి వ్రాసిన కవిత. ఇది చదివేక పూర్వ ఆంధ్రప్రదేశ్ గవర్నరు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రీ ఒకాయన గుర్తు రాక మానరు.
 .

మగాళ్ళు కేలండరులోని తేదీల్లా వస్తారు
వాళ్ళు నెలకోసారి వస్తూనే ఉంటారు
అతిపొడవైన మద్యం సీసాల
లోతులు తరచి చూచిన వాళ్ళూ,
భూమ్యాకాసాలకి చెందిన రాజులూ, దివ్యపురుషులూ;
తెగిన గొలుసునుండి రాలిన ముత్యాల్లా
వాళ్ళ స్పర్శకి నేను గడగడలాడుతూ పరిగెడతాను.
వాళ్ళ గుండెచప్పుళ్లు తలుపులు తెరుస్తాయి
వాళ్ళ ఆజ్ఞలధాటికి పాత్రలుసైతం వణుకుతాయి.
చిరుగాలి పెంపుడుకుక్కలా వాళ్ల మొఖం నాకి
వాళ్ళ వందిమాగధులవెంట పరిగెడుతూ, తిరుగుతుంది.
వాళ్ళు నగ్నంగా తయారైనట్టు నన్నూ నగ్నంగా చేసి
జంత్రవాద్యం పట్టుకున్నట్టు చేతుల్లో పట్టుకుంటారు
ఆ సంగీతం అంతులేకుండా ప్రవహిస్తుంది
గుండెలనుండి పాలుకారినట్టు
ఆ శబ్దాలు మనుషులు వినలేనంత కఠోరం
ఆ శబ్దాలు దేవుడు వినలేనంత సరళం
పిల్లలకి నవ్వడం ఎలాగో మప్పే మగ వాళ్ళు
కాలానికి ఎలా నడవాలో చెప్పే మగ వాళ్ళు
టాయ్ లెట్లలో ఇతర పురుషులతో సరసాలాడే మగ వాళ్ళు
మృత్యుహస్తాన్ని అప్పుడే ముద్దుపెట్టుకున్న మగ వాళ్ళు
నన్ను కుర్చీకి కట్టివేసిన నా బెదిరింపులనీ,
పీడకలల్నీ పట్టించుకోని మగవాళ్ళు…
అమ్మా, వాళ్ల పెదాలు నామీద
కాలిపోతున్న విమానాల్లా పడుతున్నాయి
వాళ్ళు బాగా శక్తిమంతులు, సహనవంతులు
ప్రపంచం కూలిపోతే,
తలదాచుకుందికి పరిగెత్తేవారు
వాళ్ళు ఆగి నా కన్రెప్పలు ఊడబెరుకుతున్నారు
అమ్మా! అవి నావే కానక్కరలేదు,
ఎవరివి దొరికితే వాళ్ళవేనే!
అమ్మా! ఒక సారి వెనక్కి రా!
నన్ను రక్షించు. నా కోసం
ఈ కూలిపోయిన విమాన శిధిలాల్లో వెదుకు.
.

వాల్ఝీనా మార్ట్

(b. 1981)

బెలారూస్ కవయిత్రి

  valzhyna-mortPhoto Courtesy:

https://www.poetryfoundation.org/poems-and-poets/poets/detail/valzhyna-mort

.

Men

.

Men arrive like a date on a calendar
they keep visiting once a month
men who’ve seen the bottom
of the deepest bottles
kings of both earth and heaven
and like the pearls from a torn necklace
trembling I scatter at their touch
their heartbeats open doors
vessels respond to their voice commands
and wind licks their faces like a crazy dog
and gallops after their train and roams
they undress me as if undressing themselves
and hold me in their arms like a saxophone
and oh this music these endless blues
like milk from breasts
those notes too high for human ears
those notes too low for gods
men who teach children to laugh
men who teach time how to run
men who love other men in club toilets
men who’ve kissed the hand of death herself
men who’ve never listened to my threats nightmares
which bound me to a chair
mama their lips fall on me
like burning planes
they are powerful patient
and when the world crashes
everyone runs for the shelters
they pause to pluck one of my lashes
mama not even mine
just anyone’s mama
come back
rescue me find me
in this plane wreck
.

(Translated by Franz Wright)

Valzhyna Mort

(b. 1981)

Belarus Poet and Translator

Poem Courtesy:

http://2dayspoem.blogspot.com/2009/01/men.html

దాడికి వెళ్లిన ఆటగాడు … రాబర్ట్ ఫ్రాన్సిస్, అమెరికను కవి

మన చెడుగుడు (కబడ్డీ) ఆటకి పోలికలున్న  Prisoner’s Base ఆట మీద వ్రాసినట్టున్నా, ఈ కబడ్డీ మనలో చాలమందికి పరిచయమే కాబట్టి ఇక్కడ ఇస్తున్నా. ఆటలు వర్ణిస్తూ  వచ్చిన అతి తక్కువ కవితల్లో ఇదొకటి.

***

అవసరమైతే ముందుకివెళ్లడానికీ లేకుంటే వెనక్కి మళ్ళడానికి సిద్ధంగా,

తాడుమీద నడిచే వీటివాడిలా అటూ ఇటూ పడకుండా నిలదొక్కుకుంటూ

రెండూ చేతుల వేళ్లూ రెండు వ్యతిరేకదిశల్లో చాచి ఉంచి

క్రిందపడిన బంతి మీదకెగిరినట్టు మునివేళ్ళ మీద గెంతుతూ

లేదా, ఒక అమ్మాయి తాడాట ఆడినట్టు ఆడుతూ, పట్టుకో పట్టుకో అంటూ

కొన్ని అడుగులు అటుపక్కకీ, కొన్ని అడుగులు ఇటుపక్కకీ వేసుకుంటూ

అతనెలా తడబడుతూ, పరిగెడుతూ, ఒళ్ళు జలదరించేలా తాకుతూ, కవ్విస్తూ

ప్రతిపక్షాన్ని రెచ్చగొడుతూ, పరవశంతో ఎగురుతున్న పక్షిలా విహరిస్తున్నాడో.

అతను మీతో సరసాలాడుతున్నాడు, చుట్టు ముట్టండి, చుట్టుముట్టండి

అదునుచూసి ఒడిసిపట్టండి… నెమ్మది, నెమ్మది .. అద్గదీ… ఇప్ప్పుడు!!!

.

రాబర్ట్ ఫ్రాన్సిస్

(August 12, 1901 – July 13, 1987)

అమెరికను కవి

Image Courtesy:

https://www.poetryfoundation.org/poems-and-poets/poets/detail/robert-francis

The Base Stealer

Poised between going on and back, pulled

Both ways taut like a tightrope-walker,

Fingertips pointing the opposites,

Now bouncing tiptoe like a dropped ball

Or a kid skipping rope, come on, come on,

Running a scattering of steps side-wise,

How he teeters, skitters, tingles, teases,

Taunts them, hovers like an ecstatic bird,

He’s only flirting, crowd him, crowd him,

Delicate, delicate, delicate, delicate – now!

.

Robert Francis

(August 12, 1901 – July 13, 1987)

American Poet

Poem courtesy:
http://2dayspoem.blogspot.com/2007/03/base-steeler.html

రాత్రి ప్రశంస… థామస్ లోవెల్ బెడోస్, ఇంగ్లీషు కవి

అయితే మళ్ళీ వచ్చేవన్నమాట, కాలవిహంగాల ముసలివగ్గూ, ఓ రాతిరీ!

మాకూ సూర్యుడికీ మధ్య అడ్డంగా పెద్ద పక్షిలా

నీ శరీరాన్ని వ్యాకోచింపజేసి వెలుతురును మరుగుపరుస్తూ;

చాలనట్టు, నిర్దాక్షిణ్యమన నీ గుండె అంచున చీకట్లలో

మబ్బు రెక్కల దిగువన, పొగమంచు తెగుళ్ళనీ పొదుగుతూ,

తుఫానులకీ, కర్కశమైన హిమపాతాలకి ప్రాణం పోస్తూ,

పగటి గోర్వెచ్చని ఎంద లాలనలు కరువుచేస్తూ…

భీతితో ముడుచుకుపోయిన గుడ్లగూబలు పైకి ఎగబ్రాకిన

లతల ఉయ్యాలల్లో నిను వేడుకుంటూ ప్రార్థనలు చేస్తున్నాయి.

కాంతిహీనమైన ప్రపంచం మీదకి ఒక్క ఉదుటున వాలబోయి

వెనకాడిన కాకోలములా, చెమరించిన కనులతో తృప్తిగా చూస్తావు

నిశ్శబ్దంగా, ఆఖరిగంట చప్పుడు వినిపించే వరకూ నిరీక్షిస్తూ.

వినీలాకాశంలోని నీ సదనాన్ని విడిచిపెట్టి వాలుతావు

ఈ ప్రపంచం మీదకి ఆతురతపడుతున్న గోళ్ళతో,

కుక్షిలో కాలాన్నీ, మృత్యువునీ, జీవాన్నీ సమాధిచేయడానికి.

.

థామస్ లోవెల్ బెడోస్

(30 June 1803 – 26 January 1849)

ఇంగ్లీషు కవి

To Night

So thou art come again, old black-winged night,
Like an huge bird, between us and the sun,
Hiding, with out-stretched form, the genial light;
And still, beneath thine icy bosom’s dun
And cloudy plumage, hatching fog-breathed blight
And embryo storms, and crabbéd frosts, that shun
Day’s warm caress. The owls from ivied loop
Are shrieking homage, as thou cowerest high;
Like sable crow pausing in eager stoop
On the dim world thou gluttest thy clouded eye,
Silently waiting latest time’s fell whoop,
When thou shalt quit thine eyrie in the sky,
To pounce upon the world with eager claw,
And tomb time, death, and substance in thy maw.

Thomas Lovell Beddoes

(30 June 1803 – 26 January 1849)

English Poet, Physician and Dramatist

Poem Courtesy: http://2dayspoem.blogspot.com/2009/01/to-night.html

బలవంతపు కవాతు… మిక్లోష్ రాద్నోతి, హంగేరియన్ కవి

[మిక్లోష్ రాద్నోతి రెండవ ప్రపంచయుద్ధకాలంలో హిట్లరు చేసిన మారణహోమంలో బలైపోయిన హంగేరియన్ కవి.
ఈ కవిత చదువుతుంటే మీకు రెండు విధాలుగా కన్నీళ్ళు రాకమానవు. ఒకటి అంత మంచి భవిష్యత్తు ఉన్న కవి అలా అన్యాయంగా చనిపోయినందుకు; రెండు, ఈ కవితలో అతను ఉపయోగించిన దృశ్యరూపకమైన ఉపమాలంకారాలకి. ముఖ్యంగా, నిదురిస్తున్న తోటలో, తిరోగమిస్తున్న గ్రీష్మం తీరికగా స్నానంచెయ్యడం, ఆకుల మధ్యలో పళ్ళు దిగంబరంగా ఉయ్యాలలూగడం, ఈ రెండింటికంటే అందంగా, “పగలు మెల్ల మెల్లగా నీడలు గీసుకుంటూ పోవడం”.  అది ఒక చిత్రకారుడి ప్రతిభకి దీటైన ఊహ.
ఇది చదివిన తర్వాత నాకు జాషువా గారి శ్మశానవాటిలో, ” ఈ లోకంబున వృద్ధిగాదగిన యేయేవిద్య లల్లాడెనో” అన్న పంక్తులు గుర్తు వచ్చేయి.]

***

నీకు నిజంగా పిచ్చే. క్రింద పడిపోతావు, అయినా లేచి నడుస్తావు
నీ మోకాళ్ళూ, ముణుకులూ కదలడం ప్రారంభిస్తాయి
నీకు ఏదో రెక్కలున్నట్టు నడక ప్రారంభిస్తావు.
కందకం నిన్ను ఆహ్వానిస్తోంది. భయపడి నిలబడి
ఎందుకని ఎవరైనా అడిగితే, వెనక్కి తిరిగి నువ్వు చెప్పొచ్చు
ఒక మహిళ, ఒక సహజమైన మృత్యువు…
ఇంతకంటే మెరుగైనది… నీకోసం ఎదురుచూస్తున్నాయని.
కానీ, అది నీ వెర్రి.

చాలా కాలం వరకు ఊర్లో కాలిన ఇళ్ళమీదనుండి మాత్రమే పొగలొచ్చేవి
గోడలు వెనక్కి వాలిపోయేవి, పళ్ళచెట్లు విరిగిపడేవి,
ఆగ్రహించిన రాత్రి మరింత చిక్కగా భయంకరంగా ఉంటుండేది.
ఆహ్! ఇప్పుడు వెళ్ళడానికి ఒక ఇల్లు ఉంది కాబట్టి
నాకు విలువైనదంతా నాలోనే కాకుండా బయట ఉందని
నమ్మగలిగితే ఎంత బాగుణ్ణు!
అలాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుణ్ణు!

….

ఎప్పటిలాగే, తేనెటీగలు చల్లగా ఉన్న చావడి మీద
ప్రశాంతంగా ఝంకారం చేస్తున్నాయి,
వేడి తేనెలో ఊరబెట్టిన పళ్ళు చల్లారిపోతున్నాయి
నిదురిస్తున్న తోటలో, తిరోగమిస్తున్న గ్రీష్మం తీరికగా స్నానంచేస్తోంది.
ఆకుల మధ్యలో పళ్ళు దిగంబరంగా ఉయ్యాలలూగుతున్నాయి,
తుప్పుపడుతున్న కంచె ముందర
అందమైన జుత్తుగల ఫానీ నాకోసం నిరీక్షిస్తుంటుంది.
పగలు మెల్ల మెల్లగా నీడలు గీసుకుంటూ పోతుంటుంది…

ఇవన్నీ జరిగే అవకాశం ఉంది.
చంద్రుడు ఈ రోజు ఎంత గుండ్రంగా ఉన్నాడో!
మిత్రమా, నన్ను దాటి పోబోకు.
గట్టిగా అరూ! నేను లేచి మళ్ళీ నుంచుంటాను!

మిక్లోష్ రాద్నోతి

(5 May 1909 – 9 November 1944)

హంగేరియన్ కవి

.

 

.

 

Forced March

.

You’re crazy. You fall down, stand up and walk again,

your ankles and your knees move

but you start again as if you had wings.

The ditch calls you, but it’s no use you’re afraid to stay,

and if someone asks why, maybe you turn around and say

that a woman and a sane death a better death wait for you.

But you’re crazy.

For a long time only the burned wind spins above the houses at home,

Walls lie on their backs, plum trees are broken and the angry night is thick with fear.

Oh if I could believe that everything valuable

is not only inside me now that there’s still home to go back to.

If only there were!

And just as before bees drone peacefully

on the cool veranda, plum preserves turn cold

and over sleepy gardens quietly, the end of summer bathes in the sun.

Among the leaves the fruit swing naked and in front of the rust-brown hedge

blond Fanny waits for me,

the morning writes slow shadows—

All this could happen

The moon is so round today!

Don’t walk past me, friend.

Yell, and I’ll stand up again!

.

Miklos Radnoti

(5 May 1909 – 9 November 1944)

Hungarian Poet,  shot during Holocaust

“Miklos Radnoti was born in Budapest in 1909, and orphaned at the age of 12. He published a number of collections of poems before the war and was a fierce anti-fascist. In the 1940’s he was interned in various work camps, the last time being in Bor, Yugoslavia at a copper mine, to which he was driven in a forced march with other internees. Along the way, he and 22 other prisoners were murdered near the town of Abda sometime between November 6 and 10, 1944 and tossed into a mass grave. After the war, his body was exhumed and his last poems were found in his field jacket, written in pencil in a small Serbian exercise book.

The above poem is part of the collection, published in 1946 as “Sky With Clouds”. It is dated September 5, 1944.

There are a number of poems around, written by Holocaust survivors or others who faced the atrocities of modern warfare. This one strikes me having that ring of truth — of memory unvarnished by the passage of time. I am particularly moved by how the poet conveys the way a person’s mind wanders to happier times and almost loses touch with the horrors of the present in the second half of the poem, and then is yanked back into the on-going atrocity by the fear of falling behind.

Dave Fortin “

The Poem and above write up courtesy:
http://wonderingminstrels.blogspot.com/2003/08/forced-march-miklos-radnoti.html

బేగల్… డేవిడ్ ఇగ్నతోవ్, అమెరికను కవి

మన చిత్రమైన మానసిక స్థితిని పట్టిచ్చే కవిత ఇది. కొన్ని వస్తువులు పోగొట్టుకుంటాం. వాటిని తిరిగి సంపాదించడానికి తెగ వెతుకులాడతాం. ఈ వెతుకులాటలో పొరపాటున ఏదైనా కొత్త వ్యాపకం దొరికితే, ముందు చికాకుపడినా, కొంతసేపటికి, మనం వెతుకుతున్న లక్ష్యం మరిచిపోయి, ఈ వ్యాపకానికి అలవాటుపడిపోతాం.
బేగల్ అన్నది ముందు పులియబెట్టి, తర్వాత వేచి, గట్టిగా, గారెలూ, చేగోడీల్లా గుండ్రంగా, కానీ పలచగా చుట్టలుచుట్టి తయారుచేసే వంటకం.

.

గాలికి దొర్లిపోతున్న బేగల్ ని
పట్టుకుందికి నిలబడ్డాను.
దాన్ని క్రిందపడేసినందుకు
అదొక అపశకునంలా భావించి
కోపంతో నన్ను నేను తిట్టుకున్నాను.
అది మరీ వేగంగా దొర్లసాగింది
దాని వెనకే నేనూ పరిగెత్తుతున్నాను
పళ్ళు బిగబట్టి, బాగా క్రిందకి వంగి.
ఎప్పుడు దొర్లిపోయానో నాకే తెలియదు
కాని వీధిలో అలా దొర్లుతున్నాను
తల క్రిందకీ కాళ్ళు మీదకీ పెట్టి
బేగల్ వెనక మరొక బేగల్ లా
ఒకదాని వెనక మరో పిల్లిమొగ్గ వేసుకుంటూ.
చిత్రంగా, నాకు ఇది ఎంతో బాగుంది.

.

డేవిడ్ ఇగ్నతోవ్

(February 7, 1914 – November 17, 1997)

అమెరికను కవి

.

Image Courtesy: https://www.poets.org/poetsorg/poet/david-ignatow

The Bagel

.

I stopped to pick up the bagel
rolling away in the wind,
annoyed with myself
for having dropped it
as if it were a portent.
Faster and faster it rolled,
with me running after it
bent low, gritting my teeth,
and I found myself doubled over
and rolling down the street
head over heels, one complete somersault
after another like a bagel
and strangely happy with myself.
.

David Ignatow

(February 7, 1914 – November 17, 1997)

American Poet

http://wonderingminstrels.blogspot.com/2003/08/bagel-david-ignatow.html

I did Not Take Proper Leave of You… Bojja Tarakam, Telugu Poet

I am sorry
I did not take proper leave
When we parted…
I could not speak out my mind
when the police arrested me.
You stood awestruck
with tears swelling in your eyes.
Poor me! These cuffed -hands
were helpless to dry your tears.
Ringing the ‘long-bell’ to silence
marched … the police boots.
I could not tell you
about the umpteen thoughts that swelled up in my mind
like a billowing ocean under a tempest.
The beating of the heart
failed to break the pervading silence frozen.

Then…
I could not tell you
that whatever I might have said, or,
how much ever I had had said…
my words would just make some hollow sounds
bereft of any worthwhile meaning.

Dear
I saw
lives bare, barren and parched…
without a shelter over head,
lives utterly famished
with wolves raging in their bellies,
lives akin to … the quadruped,
and, a la cadavers.
Their tales and tragedies
I tried to put into my words
breathing life into them.
I yearned to dispel the gloom
and usher in aurorae in their lives…

I wasn’t aware.
That day…
In the evening when
we were exploring the beauty of life
exchanging livelinesses of the past
they suddenly descended on us.

I could not reassure you
that I know
your tears
were not for me and me alone, but
they were tributes
to countless oppressed souls;
that they were
scuds of happiness
beacons of hope, and
betides of radiant dawns.

I am sorry
I could not tell you it all.
.
[Central Jail, 15.1.1976]

Bojja Tarakam
27 June 1939 – 16 September 2016
Telugu Poet
From “Nadi Puttina Gomtuka” – 1983

Bojja Tarakam
Photo Courtesy: https://www.facebook.com/Btharakam/

నీతో చెప్పనే లేదు
————————–
నీతో చెప్పలేదు
నేను వెళ్తున్నప్పుడు
నన్ను పోలీసులు పట్టుకున్నప్పుడు
నీతో చెప్పలేదు…
నన్ను చూస్తూ నిలబడిపోయావు
నీ కళ్ళనిండా నీళ్ళు
నీ కన్నీళ్ళు తుడవడానికి
నా చేతులకు సంకెళ్ళు
నిశ్శబ్దానికి గంటలు కొడుతూ
పోలీసు బూట్ల చప్పుళ్ళు
సముద్రం హోరులా మనసులో
పొంగే మాటల కెరటాలు
నిశ్శబ్దాన్ని చీల్చలేని
హృదయ నాదాలు
నీతో చెప్పనే లేదు…
అప్పుడు
ఏ మాటలైనా ఎన్నైనా
ఉట్టి శబ్దాలేనని
అర్థం ఏమీ ఉండదని
చెప్పలేకపోయాను నీకు
ఉండ నీడలేని
ఎండు బ్రతుకులను
తిన తిండిలేని
మండు బ్రతుకులను
మంద కడుతున్న జీవాలను
మందగిస్తున్న శవాలను
చూశాను నేను.
వారి గాధలను, బాధలను
నా మాటల్లో పేర్చాను,
నా ఊపిరితో ఊదాను.
చీకటిని తొలగించాలని
వెలుగు తేవాలని ఉవ్విళ్ళూరాను.
నాకు తెలియనే లేదు
ఒక రోజు…
నువ్వూ నేనూ సాయంకాలం
అందాలను మలచుకొంటున్నప్పుడు
ఆనందాలను తొలుచుకొంటున్నప్పుడు
హఠాత్తుగా వాళ్ళొచ్చారు.
నీతో చెప్పనే లేదు
నీ కన్నీళ్ళు
నా కొక్కడికే కాదని
కోటి కోటి బాధాతప్త హృదయాలకు
నివాళులని
ఆనంద జలదాలని
ఆశాకిరణాలని
అరుణార్ణవ కెరటాలని
నీతో చెప్పనే లేదు…
.

సెంట్రల్ జైలు. – 15.01.1976
బొజ్జా తారకం
——————-
నది పుట్టిన గొంతుక -1983

అంతా సంగీతమైన చోట… రూమీ, పెర్షియన్ కవి

ఈ గీతాల్ని భద్రపరచుకోవడమెలా? అని చింతించకు!
మన వాయిద్యాల్లో ఏది పగిలిపోయినా
ఫర్వా లేదు.

మనం ఇప్పుడు పడిన చోట
సర్వం సంగీతమయం.

తంత్రీ నినాదాలూ,పిల్లనగ్రోవి స్వరాలూ
వాతావరణంలో తేలియాడుతూనే ఉంటాయి
ప్రమాదవశాత్తూ ఈ విశ్వవీణియ
అగ్నికి ఆహుతైనా, ఇక్కడ ఇంకా చాలా
నిగూఢవాయిద్యాలుంటాయి … మ్రోగుతూ.

ఒక కొవ్వొత్తి మిణుకుమిణుకుమని చప్పున ఆరిపోతుంది.
అయినా, మన చెంత ఒక చెకుముకిరాయి, నిప్పురవ్వా ఉంటాయి.

ఈ సంగీత కళ ఒక సముద్రపు నురుగులాంటిది.
సముద్ర గర్భంలో ఎక్కడో దాగున్న
ముత్యపు చిప్పలోంచి ఆ సొగసైన గమకాలు దొరలి వస్తుంటాయి.

అలలమీద గాలి ఎగరెసే తుంపరలలా, తీరానికి
కొట్టుకొచ్చిన కర్రచెక్కల్లా … పదునులేని గీతం బయటకొస్తుంది.

మనకి అగోచరమైన
శక్తివంతమైన మూలాల్లోంచి అవి క్రమంగా సారం గ్రహిస్తాయి.

చాలు, ఇక మాటలు కట్టిపెట్టు.
నీ గుండె కవాటాన్ని బార్లా తెరువు.
బయటకీ లోపలకీ చైతన్యాన్ని ప్రసరించనీ.
.

జలాలుద్దీన్ రుమీ

Sept 30, 1207 – Dec17, 1273

పెర్షియన్ కవి

Jalal ad-Dīn Muhammad Rumi Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi
Jalal ad-Dīn Muhammad Rumi
Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi

Where Everything Is Music
.

Don’t worry about saving these songs!
And if one of our instruments breaks,
it doesn’t matter.

We have fallen into the place
where everything is music.

The strumming and the flute notes
rise into the atmosphere,
and even if the whole world’s harp
should burn up, there will still be
hidden instruments playing.

So the candle flickers and goes out.
We have a piece of flint, and a spark.

This singing art is sea foam.
The graceful movements come from a pearl
somewhere on the ocean floor.

Poems reach up like spin-drift and the edge
of driftwood along the beach, wanting!

They derive
from a slow and powerful root
that we can’t see.

Stop the words now.
Open the window in the center of your chest,
and let the spirits fly in and out.
.
Jalaluddin Rumi

Sept 30, 1207 – Dec17, 1273

Persian Poet, Sufi

courtesy:
http://wonderingminstrels.blogspot.com/2003/08/where-everything-is-music-jalaluddin.html

.

 

కేన్సరు వార్డు సందర్శన … గాట్ ఫ్రైడ్ బెన్, జర్మను కవి

హెచ్చరిక / మనవి:

ఇది భీభత్సరసప్రధానమైన కవిత.

దయచేసి గుండెధైర్యం లేనివారు ఈ కవిత చదవవొద్దని మనవి.

***

పురుషుడు:

ఈ వరుసలో గర్భాశయాలు క్షిణించిపోయిన వారు
ఈ వరుసలో రొమ్ములు క్షీణించిపోయిన వారు.
ఒకదాని పక్క ఒకటి దుర్గంధపూరితమైన పడకలు.
గంటగంటకీ నర్సులు మారుతూనే ఉంటారు.

రా! పైనున్న ఈ చిన్న దుప్పటీ నెమ్మదిగా పైకెత్తు.
చూడు. కండపట్టిన ఈ మలిన మాంసపు ముద్దే
ఒకప్పుడు పురుషుడికి అపురూపమయినదై
ఆనందదాయకమై గృహస్థుని చేసింది.

రా! రొమ్ము మీద ఈ గాయాలమచ్చలు చూడు
జపమాలలా మెత్తని కణుపుల వరుస చేతికి తగుల్తోందా?
భయపడకు. తడిమి చూడు. చర్మానికి స్పర్శజ్ఞానం లేదులే.

ఈ వ్యక్తికి, పది శరీరాలున్నంతగా రక్తం కారుతూనే ఉంటుంది
ఎవరికీ అంత రక్తం ఉండం ఎరుగను.
ఆమె కేన్సరు సోకిన గర్భాశయంనుండి
బిడ్డను కోసి బయటకు తీయవలసి వచ్చింది.

వీళ్ళని రాత్రీ… పగలూ… వాళ్ళు నిద్రపుచ్చుతారు.
కొత్తగా వచ్చిన వాళ్ళతో “నిద్ర మీకు స్వస్థత
చేకూరుస్తుం”దని చెప్తారు. కాని ఆదివారాల్లో…
సందర్శకులకోసం మేలుకొలుపుతుంటారు.

వాళ్ళు స్వల్పంగా ఆహారం తీసుకుంటారు. వాళ్ళ వీపులు
పడుకుని పడుకుని పుళ్ళైపోతాయి. ఒక్కొక్కసారి
నర్సులు వాటిని కడుగుతారు… బెంచీలు కడిగినట్టు.

ప్రతి పడకమీద ఒక సమాధి లేస్తూనే ఉంటుంది
మాంసం నేలమట్టమైపోతుంది. అందులో వేడి కొడిగడుతుంది.
శరీరసారం ప్రవహించడానికి ఎదురుచూస్తుంటుంది… మట్టి పిలుస్తుంటుంది…

గాట్ ఫ్రైడ్ బెన్

(2 May 1886 – 7 July 1956)

జర్మను కవి.

.

Man and Woman Go Through the Cancer Ward

 .

The man:

Here in this row are wombs that have decayed,

and in this row are breasts that have decayed.

Bed beside stinking bed. Hourly the sisters change.

Come, quietly lift up this coverlet.

Look, this great mass of fat and ugly humours

was precious to a man once, and

meant ecstasy and home.

Come, now look at the scars upon this breast.

Do you feel the rosary of small soft knots?

Feel it, no fear. The flesh yields and is numb.

 Here’s one who bleeds as though from thirty bodies.

No one has so much blood.

They had to cut

a child from this one, from her cancerous womb.

 They let them sleep. All day, all night.—They tell

the newcomers: here sleep will make you well.—But Sundays

one rouses them a bit for visitors.—

 They take a little nourishment. Their backs

are sore. You see the flies. Sometimes

the sisters wash them. As one washes benches.—

 Here the grave rises up about each bed.

And flesh is leveled down to earth. The fire

burns out. And sap prepares to flow. Earth calls.—

Gottfried Benn

(2 May 1886 – 7 July 1956)

Translated by Babette Deutsch

 

Poem courtesy:

http://2dayspoem.blogspot.com/2009/01/man-and-woman-go-through-cancer-ward.html

%d bloggers like this: