ఆశ ఒక రెక్కలుతొడిగిన జీవి
అది మనసుమీద అలవోకగా వాలుతుంది.
మాటలులేని మౌనగీతాన్ని ఆలపిస్తుంది
ఆ పాటకి ముగింపు లేదు.
అందులో మలయమారుతపు తియ్యందనాలు వినిపిస్తాయి
తుఫానుల ప్రచండ ఝంఝ నినదిస్తుంది
ఆ పిట్టని విహ్వలము చెయ్యవచ్చునేమో గాని
దానిపాట మాత్రం ఎందరి ఎదలనో రగుల్కొలుపుతుంది.
అతిశీతలదేశంలో ఆ పాట నేను విన్నాను
ఎన్నడూ ఎరుగని సముద్ర తరంగాలమీదా విన్నాను;
కానీ, ఎన్నడూ, ఎంత దైన్యంలోనూ
“నాకో రొట్టెముక్క పెట్టవా?” అని యాచించలేదు.
.
ఎమిలీ డికిన్సన్
(December 10, 1830 – May 15, 1886)
అమెరికను కవయిత్రి
.
.
Hope Is The Thing With Feathers
.
Hope is the thing with feathers
That perches in the soul,
And sings the tune without the words,
And never stops at all.
And sweetest in the gale is heard;
And sore must be the storm
That could abash the little bird
That kept so many warm.
I’ve heard it in the chilliest land
And on the strangest sea;
Yet, never, in extremity,
It asked a crumb of me.
.
స్పందించండి