రోజు: ఆగస్ట్ 31, 2016
-
ఆశ ఒక రెక్కలుతొడిగిన జీవి. … ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
ఆశ ఒక రెక్కలుతొడిగిన జీవి అది మనసుమీద అలవోకగా వాలుతుంది. మాటలులేని మౌనగీతాన్ని ఆలపిస్తుంది ఆ పాటకి ముగింపు లేదు. అందులో మలయమారుతపు తియ్యందనాలు వినిపిస్తాయి తుఫానుల ప్రచండ ఝంఝ నినదిస్తుంది ఆ పిట్టని విహ్వలము చెయ్యవచ్చునేమో గాని దానిపాట మాత్రం ఎందరి ఎదలనో రగుల్కొలుపుతుంది. అతిశీతలదేశంలో ఆ పాట నేను విన్నాను ఎన్నడూ ఎరుగని సముద్ర తరంగాలమీదా విన్నాను; కానీ, ఎన్నడూ, ఎంత దైన్యంలోనూ “నాకో రొట్టెముక్క పెట్టవా?” అని యాచించలేదు. . ఎమిలీ డికిన్సన్…