ఈ కవిత వెనక చాలా పెద్ద కథ ఉంది. అందులో ప్రేమా, ప్రియురాలి (Violet Szabo )ఆకస్మిక మరణం, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఫ్రెంచి ప్రతిఘటనకారులు క్షేమంగా దాటిపోడానికి కవిత అంకురించిన తీరూ, ఇది ఆధారంగా గత శతాబ్దంలో తీసిన సినిమా (Carve Her Name On The Stone), కవి స్వయంగా ఈ కవిత వెనుక కథ వ్రాసిన పుస్తకం (Between Silk and Cyanide: A code Makers War 1941-45, Free Press ,Princess Diana Funeralలో BBC Commentator దీన్ని వాడటం, అంతకంటే ముఖ్యంగా ఈ కవితకు వచ్చిన ప్రతిస్పందనలు చదివి తీరవలసినవే. లింకు క్రింద ఇవ్వబడింది.
***
నాకున్న సర్వస్వమూ ఈ జీవితమే
నా స్వంతమైన జీవితం మీకు అంకితం
నా జీవితం మీద నాకున్న ప్రేమ
అవి మీవీ, మీవీ, మీవీ.
నాకు సుఖనిద్ర దొరుకుతుంది.
నాకు విశ్రాంతి లభిస్తుంది,
ఇంతకీ మృత్యువు కేవలం ఒక విరామం మాత్రమే,
ఇక్కడ దట్టమైన పచ్చికలో నా ప్రశాంత యుగాలన్నీ
మీ కోసం, మీ కోసం, మీ కోసం.
.
లియో మార్క్స్,
(Leopold Samuel “Leo” Marks, MBE)
24 September 1920 – 15 January 2001)
English cryptographer during the Second World War.
A Code Poem For The French Resistance
.
The life that I have is all that I have
And the life that I have is yours.
The love that I have of the life that I have
Is yours and yours and yours.
A sleep I shall have A rest I shall have,
Yet death will be but a pause,
For the peace of my years in the long green grass
Will be yours and yours and yours.
–
Leo Marks
Leopold Samuel “Leo” Marks, MBE
24 September 1920 – 15 January 2001)
English cryptographer during the Second World War.
Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.com/1999/09/code-poem-for-french-resistance-leo.html
స్పందించండి