రోజు: ఆగస్ట్ 22, 2016
-
ఫోటో… కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి
Picasso ఒక సారి కళ గురించి చెబుతూ, “కళ గోడమీద తగిలిచుకునే అందమైన బొమ్మలకి పరిమితమైనది కాదు; వాటికన్నా అతీతమైనది,” అని అంటాడు. కనుక ఒకోసారి కళ అందవిహీనంగా ఉన్నది కూడా కావచ్చు. దాని అర్థం ఏమిటి? అందవిహీనమైనదాన్ని ఏ కళాకారుడూ సృష్టించడు కదా? అది ఒక నిరసన తెలిపే మార్గం. తన ఆగ్రహాన్ని ప్రకటించే తీరు. దిగంబరకవులు తమ కవిత్వంలో అంతవరకు సంప్రదాయంగా వస్తున్న ఉపమానాలూ, మాటలూ కాకుండా వేరే భాష ఎందుకు ఉపయోగించినట్టు? కవిత్వం…