ప్రతి రాత్రీ ఈ పీడకలే… గెరాల్డ్ గోల్డ్, ఇంగ్లీషు కవి

ఈ పీడకలే… ఏ రాత్రికి ఆ రాత్రి
నా తలగడపై పళ్ళికిలిస్తూ కనిపిస్తుంటుంది …
నేను అమాయకత్వంలో ఉండే మనశ్శాంతితో
ఆనందానికి ఆర్రులుజాచే కాంక్షని కలగలుపుతునానట:
ఇంతకుమించిన అపవాదూ, దూషణ ఉందా
కేవలం దివ్యసంకల్పంతో, నిరపేక్షగా చేస్తుంటే…
సోమరితనానికీ స్వార్థానికీ ముసుగు వేస్తున్నానట
ఫాదిరీ నల్లగౌనులోనూ, దేవత తెల్లగౌనులోనూ.

మహప్రభో, మీరు పాపం చేస్తే, దానిలో ఆనందం అనుభవించండి,
దాన్ని ఆనందంకోసం చెయ్యండి. అంతే కాని
“అదిగో చూడు, ఆత్మ ఎంత స్వేఛ్ఛగా ఎగిరిపోతోందో!…
ఒక్క క్షణంలో ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టి
భగవంతుడు అందులో ప్రకాశిస్తాడని” కబుర్లు చెప్పొద్దు;
బదులుగా ఇలా చెప్పండి: “ఇది పాపం. అది నేను చేస్తాను;
ఈ పాపానికి మూల్యం చెల్లించాలి. .. దానికి సిద్ధంగా ఉన్నాను.”
.
గెరాల్డ్ గోల్డ్
(June 1885- Dec 1936)
ఇంగ్లీషు కవి

(ఇది రక రకాల ముసుగుల్లో మనుషులు… ముఖ్యంగా మతాధికారులూ, బాబాలూ చేసే పాపాలపై విమర్శ)

.

This is the Horror that, Night After Night

This is the horror that, night after night,
Sits grinning on my pillow — that I meant
To mix the peace of being innocent
With the warm thrill of seeking out delight:
This is the final blasphemy, the blight
On all pure purpose and divine intent —
To dress the selfish thought, the indolent,
In the priest’s sable or the angel’s white.

For God’s sake, if you sin, take pleasure in it,
And do it for the pleasure. Do not say:
‘Behold the spirit’s liberty! — a minute
Will see the earthly vesture break away
And God shine through.’ Say: ‘Here’s a sin — I’ll sin it;
And there’s the price of sinning — and I’ll pay.’
.
Gerald Gould
(June 1885- Dec 1936)
English Poet
Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.com/2003/03/this-is-horror-that-night-after-night.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: