రోజు: ఆగస్ట్ 21, 2016
-
ప్రతి రాత్రీ ఈ పీడకలే… గెరాల్డ్ గోల్డ్, ఇంగ్లీషు కవి
ఈ పీడకలే… ఏ రాత్రికి ఆ రాత్రి నా తలగడపై పళ్ళికిలిస్తూ కనిపిస్తుంటుంది … నేను అమాయకత్వంలో ఉండే మనశ్శాంతితో ఆనందానికి ఆర్రులుజాచే కాంక్షని కలగలుపుతునానట: ఇంతకుమించిన అపవాదూ, దూషణ ఉందా కేవలం దివ్యసంకల్పంతో, నిరపేక్షగా చేస్తుంటే… సోమరితనానికీ స్వార్థానికీ ముసుగు వేస్తున్నానట ఫాదిరీ నల్లగౌనులోనూ, దేవత తెల్లగౌనులోనూ. మహప్రభో, మీరు పాపం చేస్తే, దానిలో ఆనందం అనుభవించండి, దాన్ని ఆనందంకోసం చెయ్యండి. అంతే కాని “అదిగో చూడు, ఆత్మ ఎంత స్వేఛ్ఛగా ఎగిరిపోతోందో!… ఒక్క క్షణంలో…