మనం చాలా విశాలంగా ఆలోచిస్తాం
కాని నడిచేది మాత్రం దగ్గరదారిలో;
మనం దయ్యాలకు అడుగులకు మడుగులొత్తి
ఇంటిముఖం పట్టేటపుడు గడగడ వణుకుతుంటాం;
మనం రాత్రి కొలిచేదొక దేవుడిని
పగలు ప్రార్థించే దింకొక దేవుడిని.
.
ఎర్నెస్ట్ హెమింగ్వే
July 21, 1899 – July 2, 1961
అమెరికను నవలా కారుడు
(ఈ కవితలో రచయిత మన ఆత్మవంచన తత్త్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు. మన ఆలోచనలు మహోన్నతంగా ఉంటాయి. కానీ ఆచరణలో మాత్రం దొడ్డిదారి పడతాం. మనం సేవించేది, అడుగులకి మడుగులొత్తేది మన బలహీనతలకి. కానీ ఇంటిదారి ( అంటే ఇక్కడ మరణం ఆసన్నమైనపుడు) భయకంపితులమౌతాము. రాత్రి వ్యసనాలకి బానిసలము. పగలు మాత్రం భగవంతునికి ఎక్కడలేని ప్రార్థనలూ చేస్తాము.)
.
Chapter Heading
.
For we have thought the longer thoughts
And gone the shorter way.
And we have danced to devils’ tunes,
Shivering home to pray;
To serve one master in the night,
Another in the day
స్పందించండి