ఒకే విషయం మీద వేర్వేరు కవులు స్పందించిన కవితలన్నీ ఒకచోట దొరికే సందర్భం అరుదుగా తటస్థిస్తుంది. అలాంటిదే ఇది. “Sin” మీద ముగ్గురు కవుల (నిజానికి అందులో ఒకరు గొప్ప నవలా కారుడు) స్పందన వరుసగా మూడు రోజులపాటు చదవొచ్చు.
***
. నాకు చాలాసార్లు జ్ఞానులైన ఫకీరులు చెప్పారు ఊహించడమూ, ఆచరించడమూ రెండూ నేరమేనని దైవం ఆచరించిన వారిని ఎలా శిక్షిస్తాడో మనసులో కోరుకున్నవారినీ అలాగే శిక్షిస్తాడని.
కోరిక శిక్షార్హమైనప్పుడు, నువ్వూ నేనూ మనస్సాక్షిగా నేరానికి శిక్షార్హులమే. కనుక, కనీసం శిక్ష అనుభవించబోయేముందు కొంత సుఖాన్ని అనుభవిద్దాము, రా!
థామస్ మూర్ (28 May 1779 – 25 February 1852) ఐరిష్ కవి
An Argument
I’ve oft been told by learned friars,
That wishing and the crime are one,
And Heaven punishes desires
As much as if the deed were done.
స్పందించండి