సానెట్ 43… ఎడ్నా సెయింట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి
ఏ పెదాలు నా పెదాలను చుంబించాయో; ఎక్కడ, ఎందుకు
నేను మరిచిపోయానో; ఏ చేతులు తెల్లవారే వరకూ
నా తలకి ఆసరా ఉన్నాయో; కానీ ఈ రాత్రి
వర్షం మాత్రం భీకరంగా ఉంది, కిటికీ అద్దాలపై
టప్ టప్ మంటూ; సమాధానానికి ఎదురుచూస్తూ నిట్టురుస్తూ,
నా గుండెలో ఎక్కడో బాధ మెత్తగా కలుక్కుమంటోంది
కారణం నను గుర్తుపెట్టుకోని నా పిల్లలు మరొకసారి
ఏడ్చుకుంటూ ఈ అర్థరాత్రి నా దగ్గరకి రారు.
అనుకుంటూ ఒంటరిగా హేమంతంలో నిలుచుంటుందొక చెట్టు.
దానికి పిట్టలు ఒకటొకటిగా విడిచిపెట్టాయని తెలియదు.
కానీ ఇది తెలుసు: కొమ్మలు మునపటికన్నా చిన్నబోయి ఉన్నాయని;
ఏ ప్రేమలు తమితీరా పెనవేసుకు నిష్క్రమించాయో చెప్పలేను.
నాకు తెలిసిందొకటే, కొద్దికాలం క్రితమే నాలో వసంతం
రాగాలాలపించిందనీ; మరొకసారి ఆ అవకాశం లేదనీ.
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే
February 22, 1892 – October 19, 1950
అమెరికను కవయిత్రి
