మనోహరమైన ఈ యవ్వనశోభలు అంతరించినా… థామస్ మూర్, ఐరిష్ కవి

నన్ను నమ్ము! ఈ రోజు నేను ఎంతో తమకంతో పరీక్షిస్తున్న
మనోహరమైన ఈ యవ్వన శోభలు
రేపు ఒక్కసారి మారిపోయినా, దేవతల వరాల్లా
అవి నా చేతిలోంచి ఎగిరిపోయినా
ఈ క్షణంలోలానే నిన్ను అప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాను.
నీ సౌందర్యం దాని చిత్తమొచ్చినపుడు మారిపోనీ,
ఆ మార్పులో నా ప్రతికోరికా
పచ్చగా నిన్ను అల్లుకునే ఉంటుంది.

అందమూ, వయసూ నీ స్వంతమైననాడే కాదు,
కన్నిటితో నీ బుగ్గలు మలినమైననాడే కాదు
ఈ ఆత్మకి నీపై గల అనురక్తీ, నమ్మకమూ బహిర్గతమయ్యేది,
(కాలం గడుస్తున్నకొద్దీ నిన్ను ఇంకా ప్రాణప్రదం చేస్తుంది);
నిజంగా ప్రేమించే హృదయం తన ప్రేముడినెన్నడూ మరువలేదు,
కడదాకా ఒక్కలాగే ప్రేమిస్తుంటుంది,
సూర్యముఖి ఉదయించినపుడు సూర్యుణ్ణి ఎంతప్రేమగా చూస్తుందో
తనదైవం అస్తమించినపుడుకూడా అంతే ప్రేమగా చూపులప్పగించినట్టు.
.
థామస్ మూర్

(28 May 1779 – 25 February 1852 )
ఐరిష్ కవి

 

 

.

.

BELIEVE ME, IF ALL THOSE ENDEARING YOUNG CHARMS

.

Believe me, if all those endearing young charms,

Which I gaze on so fondly to-day

Were to change by to-morrow, and fleet in my arms,

Like fairy-gifts fading away,

Thou wouldst still be adored, as this moment thou art,

Let thy loveliness fade as it will,

And around the dear ruin each wish of my heart

Would entwine itself verdantly still.

It is not while beauty and youth are thine own,

And thy cheeks unprofaned by a tear,

That the fervor and faith of a soul can be known,

To which time will but make thee more dear;

No, the heart that has truly loved never forgets,

But as truly loves on to the close,

As the sun-flower turns on her god, when he sets,

The same look which she turned when he rose.

.

Thomas Moore

(28 May 1779 – 25 February 1852 )

Irish Poet

Poem Courtesy:

Click to access Poems-Set1.pdf

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: