రోజు: ఆగస్ట్ 11, 2016
-
మనోహరమైన ఈ యవ్వనశోభలు అంతరించినా… థామస్ మూర్, ఐరిష్ కవి
నన్ను నమ్ము! ఈ రోజు నేను ఎంతో తమకంతో పరీక్షిస్తున్న మనోహరమైన ఈ యవ్వన శోభలు రేపు ఒక్కసారి మారిపోయినా, దేవతల వరాల్లా అవి నా చేతిలోంచి ఎగిరిపోయినా ఈ క్షణంలోలానే నిన్ను అప్పుడూ ఆరాధిస్తూనే ఉంటాను. నీ సౌందర్యం దాని చిత్తమొచ్చినపుడు మారిపోనీ, ఆ మార్పులో నా ప్రతికోరికా పచ్చగా నిన్ను అల్లుకునే ఉంటుంది. అందమూ, వయసూ నీ స్వంతమైననాడే కాదు, కన్నిటితో నీ బుగ్గలు మలినమైననాడే కాదు ఈ ఆత్మకి నీపై గల అనురక్తీ,…