అనువాదలహరి

అడవి బాతులు… మేరీ ఓలివర్ , అమెరికను కవయిత్రి

మీరు మంచి వాళ్లై ఉండవలసిన అవసరంలేదు.

ప్రాయశ్చిత్తం చేసుకుందికి మీరు మోకాళ్ళమీద
ఎడారిలో వందలమైళ్ళు నడవ వలసిన పనీ లేదు.

మీ శరీరంలో దాగున్న ఆ మృదువైన జంతువుని
దానికి ఏది ఇష్టమయితే దాన్ని ఇష్టపడనిస్తే చాలు

మీ నిరాశా నిస్పృహల గురించి నాకు చెప్పండి, నావి నేను చెబుతాను.
ఈ లోపున ప్రపంచం దాని మానాన్న అది నడిచిపోతుంటుంది.
ఈ లోపున సూర్యుడూ, స్ఫటికాల్లాంటి వడగళ్ళవానలూ
ఈ సువిశాల మైదానాల మీంచి,
పచ్చిక బయళ్ళమీంచి, దట్టమైన అడవులమీంచి
మహాపర్వతాలమీంచి, నదుల మీంచి నడిచిపోతాయి.
ఈ లోపున అడవి బాతులు, నిర్మల వినీలాకాశంలో,
బారులుతీరి ఇంటిదారిపడుతూ ఉంటాయి.
నువ్వెవరివైనా, ఎంత ఒంటరివైనా,
ఈ ప్రపంచం మీ ఆలోచనలకు ఆధారభూతమౌతుంది,
అడవి బాతుల్లాగే రారమ్మని పిలుస్తుంటుంది, పరుషంగానైనా ఉత్సాహంతో
ఈ వసుధైక కుటుంబకంలో మీ స్థానాన్ని
పదే పదే ప్రకటిస్తూ…
.

మేరీ ఓలివర్

జననం: సెప్టెంబరు 10, 1935

అమెరికను కవయిత్రి

1984 పులిట్జరు బహుమతి గ్రహీత

 .

.

Wild Geese

.

You do not have to be good.
You do not have to walk on your knees
for a hundred miles through the desert, repenting.

You only have to let the soft animal of your body
love what it loves.

Tell me about your despair, yours, and I will tell you mine.
Meanwhile the world goes on.
Meanwhile the sun and the clear pebbles of the rain
are moving across the landscapes,
over the prairies and the deep trees,
the mountains and the rivers.
Meanwhile the wild geese, high in the clean blue air,
are heading home again.
Whoever you are, no matter how lonely,
the world offers itself to your imagination,
calls to you like the wild geese, harsh and exciting –
over and over announcing your place
in the family of things.
.
Mary Oliver
(born September 10, 1935)
American
Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.com/2000/05/wild-geese-mary-oliver.html

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: