నెల: ఆగస్ట్ 2016
-
ఆశ ఒక రెక్కలుతొడిగిన జీవి. … ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
ఆశ ఒక రెక్కలుతొడిగిన జీవి అది మనసుమీద అలవోకగా వాలుతుంది. మాటలులేని మౌనగీతాన్ని ఆలపిస్తుంది ఆ పాటకి ముగింపు లేదు. అందులో మలయమారుతపు తియ్యందనాలు వినిపిస్తాయి తుఫానుల ప్రచండ ఝంఝ నినదిస్తుంది ఆ పిట్టని విహ్వలము చెయ్యవచ్చునేమో గాని దానిపాట మాత్రం ఎందరి ఎదలనో రగుల్కొలుపుతుంది. అతిశీతలదేశంలో ఆ పాట నేను విన్నాను ఎన్నడూ ఎరుగని సముద్ర తరంగాలమీదా విన్నాను; కానీ, ఎన్నడూ, ఎంత దైన్యంలోనూ “నాకో రొట్టెముక్క పెట్టవా?” అని యాచించలేదు. . ఎమిలీ డికిన్సన్…
-
సానెట్ 38… షున్ తారో తనికావా, జపనీస్ కవి
(దూరం అన్న ప్రాథమిక భావనని తీసుకుని అద్భుతంగా అల్లిన కవిత ఇది. “దూరపు కొండలు నునుపు” అని మనకు ఒక సామెత. దూరాలు లోపాలని గ్రహించలేనంతగా, లేదా పట్టించుకోలేనంతగా చేస్తాయి. ఈ దూరమే మనుషుల్ని దగ్గరకు చేరాలన్న ఆరాటాన్ని కలిగిసుంది. కానీ, దగ్గరగా ఎక్కువకాలం ఉన్నకొద్దీ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవి మధ్య దూరాన్ని సృష్టిస్తాయి. కొంతకాలం గడిచేక ఈ దూరాలు కల్పించిన అవగాహనలేమి, ఈ లోపాలనన్నిటినీ కప్పిపుచ్చి మళ్ళీ మనల్ని ఒక సుందర దృశ్యంగా మలుస్తాయి.…
-
Is This All Man, After All?!… Mercy Margaret, Telugu, Indian
Mounds of scattered flesh smelling still fresh ooze blood. Head to one side, and severed hands and legs the other side. The position of the corpse suggests the victim had tried to jump on the run and dropped dead. The torso, hanging half on either side of the wall seems to wail for the…
-
Sidara Sendrayya… Aruna Sagar, Telugu, Indian
When he laughs the river glitters; When he gets neck deep into it It would embrace him in a vortex. The River is so fond of him. Sitting on its bank He engages in sweet nothings with her; braving the speeding waters he dares to stall it with his hand. The river likes that gesture.…
-
ఒక సంకేత కవిత… లియో మార్క్స్, ఇంగ్లీషు
ఈ కవిత వెనక చాలా పెద్ద కథ ఉంది. అందులో ప్రేమా, ప్రియురాలి (Violet Szabo )ఆకస్మిక మరణం, రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఫ్రెంచి ప్రతిఘటనకారులు క్షేమంగా దాటిపోడానికి కవిత అంకురించిన తీరూ, ఇది ఆధారంగా గత శతాబ్దంలో తీసిన సినిమా (Carve Her Name On The Stone), కవి స్వయంగా ఈ కవిత వెనుక కథ వ్రాసిన పుస్తకం (Between Silk and Cyanide: A code Makers War 1941-45, Free Press…
-
ప్రార్థన (మేఘాల వెనుకనున్న సూర్యుడికి)… పీట్ హీన్, డేనిష్ కవి, శాస్త్రజ్ఞుడు.
సమస్తసృష్టికీ ఆధారభూతమైన ఓ సూర్యుడా! భూమిమీద అన్ని వస్తువులమీదా కిరణాలు ప్రసరించు. నేను మరీ గొంతెమ్మకోరిక కోరుకుంటున్నాననిపిస్తే కనీసం నా దేశపు నేలమీద ప్రసరించు. నీకు అదికూడా అత్యాశగా కనిపిస్తే, సరే, ఎలాగోలా, నా మీదైనా ప్రసరించు ! . పీట్ హీన్ 16 December 1905 – 17 April 1996 డేనిష్ శాస్త్రజ్ఞుడు Prayer (to the sun above the clouds) Sun that givest all things birth…
-
ఓ గులాబీ! నువ్వొక అచ్చపు వైరుధ్యానివి! … రిల్కే, ఆస్ట్రియను కవి
ఓ గులాబీ! నువ్వొక అచ్చపు వైరుధ్యానివి! అన్ని రేకలున్నా ఆ నీడన ఎవరూ ఆనందంగా నిద్రించ కాంక్షించరు. . రిల్కే 4 December 1875 – 29 December 1926 ఆస్ట్రియను కవి ఇది రిల్కే స్వయంగా రాసుకున్న మృత్యుల్లేఖనము (epitaph). జర్మనులో Lust అంటే బాధ. ఇక్కడ వైరుధ్యము గులాబికి ఎన్నో రేకులున్నాయి. కానీ వాటినీడన ముళ్ళున్నాయి. కనుక అవి చూసి ఎవరూ ప్రశాంతంగా నిద్రించ సాహసించరు. [మరొక అన్వయం: ఇక్కడ రేకలు ఎర్రని పెదాలకు…
-
Can A Mirror Lie? … Karlapalem Hanumantha Rao, Telugu, Indian
(A surrealist Poem) Somebody Offered me a quarter In my dream And said,”Boy! Buy whatever I want.” After waking up I went to the market cheerfully and bought dark clouds, and soaps to wash them, Trees And the stairs to climb them, long wide highways to leisurely lie down and narrow easy flowing canals…
-
An Earnest Appeal… Dasari Amarendra, Telugu, Indian
Yes, it’s true. I admit I was recklessness In falling asleep like a log. Without realizing there could be you around it’s true that in the cradle swing of train I fell asleep oblivious to the world. Well, You did your duty. I don’t find fault with you. *** You might have opened the suitcase…
-
ఫోటో… కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి
Picasso ఒక సారి కళ గురించి చెబుతూ, “కళ గోడమీద తగిలిచుకునే అందమైన బొమ్మలకి పరిమితమైనది కాదు; వాటికన్నా అతీతమైనది,” అని అంటాడు. కనుక ఒకోసారి కళ అందవిహీనంగా ఉన్నది కూడా కావచ్చు. దాని అర్థం ఏమిటి? అందవిహీనమైనదాన్ని ఏ కళాకారుడూ సృష్టించడు కదా? అది ఒక నిరసన తెలిపే మార్గం. తన ఆగ్రహాన్ని ప్రకటించే తీరు. దిగంబరకవులు తమ కవిత్వంలో అంతవరకు సంప్రదాయంగా వస్తున్న ఉపమానాలూ, మాటలూ కాకుండా వేరే భాష ఎందుకు ఉపయోగించినట్టు? కవిత్వం…