నెల: జూలై 2016
-
అసుర సంధ్యవేళ… HW లాంగ్ ఫెలో, అమెరికను కవి
Hear this lovely poem here పగటికీ రాత్రికీ మధ్య మునిమాపులో చీకటి నలుదిక్కులా ముసురుకునే వేళ పగలుచేసే పనులకు విశ్రాంతి సమయం వస్తుంది దాన్నే (బాల)”అసుర సంధ్యవేళ” అంటారు. సరిగా నా నెత్తిమీది గదిలో పిల్లల పాదాల చప్పుడు వినిపిస్తోంది, తలుపు అప్పుడే తెరుచుకున్న ధ్వని చిన్నారుల తియ్యని మెత్తని గుసగుసలు. నే చదువుకునే గది దీపం వెలుగులో పెద్ద హాలులోని మెట్లు దిగుతూ గంభీరంగా ఏలిస్, నవ్వుతూ ఏలెగ్రా, బంగారు జుత్తులో ఈడిత్…
-
శలభము చెప్పిన పాఠము… డాన్ మార్క్విజ్, అమెరికను
(గమనిక: ఈ కవిత బొద్దింకలో ప్రవేశించిన కవి చెబుతున్నాడు.) ఓ రోజు సాయంత్రం నేనో దీపపు పురుగుతో మాటాడుతున్నాను అది విద్యుత్ బల్బులోకి ఎలాగైనా దూరిపోయి అక్కడి ఫిలమెంటుమీద మాడిపోవాలని ప్రయత్నిస్తోంది నే నడిగాను, మీరెందుకు ఇలాంటి సాహసాలు చేస్తారని. అది ఈ పురుగులకి సంప్రదాయమా? “అది బల్బు గనుక, గాజు తొడుగుంది గనుక సరిపోయింది గాని, దానికి బదులు అక్కడ ఏ కొవ్వొత్తో ఉండి ఉంటే, ఈ పాటికి బూడిదకూడా మిగలకుండా మాడిపోయేదానివి నీకు బుద్ధిలేదా?”…
-
తోటలోని అబ్బాయి… హెన్రీ వాన్ డైక్, అమెరికను
చీకూ చింతలులేని ఆలోచనల ఉద్యానంలోకి నేను కొత్తగా అడుగుపెట్టగానే, తలుపు తెరిచి కనిపించింది, ఒక సారి లోనకి వెళదామా అనిపించింది, వెళ్ళి అక్కడి దారుల్నీ, అక్కడి అందమైన లతానికుంజాలనీ తాపడంచేసినట్టు విరిసినపూలని శోధిద్దామనిపించింది; ఒకప్పుడు నేను అమితంగా ప్రేమించిన ఈ తోటలోకి ధైర్యంగా అడుగుపెట్టేముందు ఒక నిష్కల్మషమైన గొంతు వినాలనిపించింది, ఆ తోట తెలియకుండానే పోగొట్టుకున్నాను, అనుకోకుండా తారసపడింది. సరిగ్గా ద్వారానికి ముందరే నాకో అబ్బాయి కనిపించేడు, చాలా వింత కుర్రాడు, అయినా నాకు ఎంతో ఆప్తుడు, …
-
మరొకసారి ప్రయత్నించు… అజ్ఞాత కవి
ఈ పాఠం నువ్వు శ్రద్ధగా వినిపించుకోవాలి మరో సారి, మరో సారి, మరోసారి ప్రయత్నించు; మొదటిప్రయత్నంలో నువ్వు సఫలుడివి కాపోతే మరో సారి, మరో సారి, మరోసారి ప్రయత్నించు. ఒకటి, రెండు సార్లు నువ్వు విఫలమవొచ్చు, మరోసారి ప్రయత్నించు; నువ్వు చివరికి సాధించాలనుకుంటే, మరోసారి ప్రయత్నించు. మరోసారి ప్రయత్నించడం సిగ్గుచేటు కాదు మనం పందెం గెలవకపోవచ్చు; అలాంటప్పుడు ఏమిటి చెయ్యాలి? మరోసారి ప్రయత్నించాలి. నీకు నీ పని కష్టంగా తోచినపుడు, మరోసారి ప్రయత్నించు; కాలమే తగిన ప్రతిఫలం…
-
కాకవంధ్య… సీలియా గిల్బర్ట్ , అమెరికను
(ఒకే చూలు కలిగిన స్త్రీని ‘కాకవంధ్య’ అంటారు) . చూరుమీద పావురాలు, పక్కన మంత్రసానులు, రంగురంగుల కదలిక, విధి గురించి ఏవో పిచ్చిమాటలు నా పొట్టను మించిన ఒంటరితనం, ఉమ్మనీరు, అందులో నిగూఢంగా జీవిస్తూ జీవి ఎవరూ మాటాడరు, ఎవరూ చూడరు, గడియారం కదులుతుంటే బల్లమీద కాళ్ళు జాపుకుని. సూర్యుడు బాగా ఎండ కాచి అస్తమిస్తాడు, చంద్రుడు లేస్తాడు. 15 నుండి 24, గర్భసంచీ వ్యాకోచించడం ప్రారంభిస్తుంది; లీలగా జ్ఞాపకం: ప్రాణం కడకట్టుకుపోతోంది, గుహలూ, కోటలూ… హాల్లో…
-
పోలిక… లెటీటియా ఎలిజబెత్ లాండన్, ఇంగ్లీషు కవయిత్రి
ఒక అందమైన ఇంద్రధనుసు లాంటి జీవితం చాలు; ఆనందంతో గెంతుతూ, మిడిసిపాటుతో నిండినది: అటువంటి జీవితం వర్సైల్స్ లోని ఉద్యానవనం లాంటిది, అక్కడ అన్నీ కృత్రిమమైనవే; అక్కడ సెలయేరు చలువరాయి తొట్టెలలో బంధించబడుతుంది, లేదా వేడిగా ఉన్న గాలిలోకి చిమ్మబడుతుంది… జలపాతాల్లా అద్భుతంగా మెరుస్తూ; ఆ ప్రకృతి శక్తి, అంతటి మహత్తరశక్తీ, క్షణికమైన ఆటవస్తువైపోతుంది; అన్ని ఆటవస్తువుల్లాగే, దానిజీవితమూ బుద్బుదమే. . లెటీటియా ఎలిజబెత్ లాండన్ 14 August 1802 – 15 October 1838 ఇంగ్లీషు…
-
తర్వాత… డేవిడ్ బేకర్, అమెరికను కవి
వేన్ లో కాసేపు ప్రయాణం చేసిన పిదప, మా ఎనమండుగురమూ అక్కడ ఎండలో— తెల్లని చొక్కాలు ఒంటికి అంటుకుపోతుంటే, ఆమె చేతులనుండి తీసిన గ్లోవ్జ్ తో ముఖం విసురుకుంటూ. పనివాళ్ళు ఒక పెద్ద నీలం గుడారం నిలబెట్టారు సమాధితవ్వుతున్న మాకు ఎండనుండి రక్షణకి ఈ మధ్యాహ్నం అంతా ఎండ మహాతీవ్రంగా కాసింది పక్కన నిటారుగా నిల్చున్న ఎల్మ్ చెట్లమీంచి అడుగులో అడుగేసుకుంటూ మా నెత్తిమీంచే నడిచేడు సూర్యుడు. ఒక సుదీర్ఘ ప్రవాహంలా చుట్టుపక్కలవాళ్ళూ, స్నేహితులూ, ఊరిలోని పెద్దలూ,…
-
పోగొట్టుకున్నవి… యెహుదా అమిఖాయ్, ఇజ్రేలీ కవి
వార్తాపత్రికల్లోనూ, ప్రకటన ఫలకాలమీదా పోగొట్టుకున్న వస్తువులగురించి వెదుకుతుంటాను. ఈ విధంగా మనుషులు ఏమి పోగొట్టుకున్నారో వాళ్ళకి ఏవంటే ఇష్టమో నాకు తెలుస్తుంది. ఒకసారి అలసిన నా తల దట్టంగా జుట్టున్న నాగుండెపై వాలిపోయింది. అక్కడ మా నాన్న శరీర వాసన ముక్కుకి తాకింది అదీ, చాలా సంవత్సరాల తర్వాత. నా జ్ఞాపకాలు ఎలాంటివంటే తిరిగి చెకోస్లొవేకియా పోలేని వాడూ చిలీకి తిరిగిపోవాలంటే భయపడేలాంటి వాడివి. ఒక్కోసారి నాకు కనిపిస్తుంది పాలిపోయిన నేలమాళిగవంటి గదీ… అక్కడ మేజామీద ఒక…