నేను అందంగా,యవ్వనంలో ఉన్నపుడు… ఎలిజబెత్ మహారాణి 1

 

నేను అందంగా,యవ్వనంలో దేముని అనుగ్రహానికి పాత్రమైనపుడు
చాలామంది నా చేయి అర్థిస్తూ ప్రాధేయపడ్డారు.
నేను వాళ్ళందరినీ తిరస్కరించాను. సమాధానంగా,
ఫో! ఫో! ఇంకెక్కడైనా వెతుక్కో,
బ్రతిమాలుతూ మరి నన్ను విసిగించొద్దుఅన్నాను

ఎన్ని కళ్ళు దుఃఖంతో విచారిస్తూ ఏడవడం చూశాను
ఎన్ని హృదయాలు నిట్టుర్చేయో నేను చూపించగల శక్తి నాకు లేదు.
అయినా రోజూ గర్వంతో మిడిసిపడుతూ వాళ్ళతో అన్నాను:
ఫో! ఫో! ఇంకెక్కడైనా వెతుక్కో,
బ్రతిమాలుతూ మరి నన్ను విసిగించొద్దుఅని.

ఒకరోజు సౌందర్యాధిదేవత వీనస్ కుమారుడైన క్యూపిడ్
సుందరీ! నువ్వు అంత సిగ్గుపడుతున్నావు కనుక,
నీ అందాలు నేను త్రుంచెస్తున్నాను; నిన్నాశించేవారిని ఇకపై
ఫో! ఫో! ఇంకెక్కడైనా వెతుక్కో,
బ్రతిమాలుతూ మరి నన్ను విసిగించొద్దుఅని అనక్కరలేదు.

అతనామాట అన్నతర్వాత, నా గుండెలో ఎంత బాధకలిగిందంటే
క్షణం నుండీ పగలూ రాత్రీ నాకు మనశ్శాంతి దొరకలేదు.
అదిగో, అప్పటినుండి విచారిస్తూనే ఉన్నాను:
ఫో! ఫో! ఇంకెక్కడైనా వెతుక్కో,
బ్రతిమాలుతూ మరి నన్ను విసిగించొద్దుఅని అన్నందుకు.
.
ఎలిజబెత్ మహా రాణి-1
ఇంగ్లీషు

 

 

When I was fair and young, and favour graced me

 

.

 

 When I was fair and young, and favour graced me,

 Of many I was sought their mistress for to be.

 But I did scorn them all, and answered them therefore,

      ‘Go, go, seek some otherwhere

      Importune me no more.’

 

 How many weeping eyes I made to pine with woe;

 How many sighing hearts I have no skill to show.

 Yet I the prouder grew, and answered them therefore,

      ‘Go, go, seek some otherwhere

      Importune me no more.’

 

 Then spake fair Venus’ son, that proud victorious boy,

 And said, “Fine dame, since that you be so coy

 I will so pluck your plumes that you shall say no more

      ‘Go, go, seek some otherwhere

      Importune me no more.’”

 

 When he had spake these words, such charge grew in my breast

 That neither night nor day since that, I could take any rest.

 Then lo, I did repent that I had said before,

      ‘Go, go, seek some otherwhere

      Importune me no more.’

.

 

 Queen Elizabeth I

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: