నా శరీరం ఎంత దుర్బలమో నాకు తెలుసు
బయటి శక్తులూ, లోపలి బలహీనతలూ దాన్ని చంపగలవు;
నా మనసు దివ్యస్వభావమూ తెలుసు
కానీ, దాని తెలివీ, ఇఛ్ఛ కలుషితమైపోయాయి.
నా ఆత్మకి అన్నీ తెలుసుకోగల శక్తి ఉందని తెలుసు
కానీ అది గుడ్డిగా, మూర్ఖంగా ప్రవర్తిస్తుంది;
నేను ప్రకృతి గారాబు పట్టిలలో ఒకడినని తెలుసు
కానీ చాలా అల్పవిషయాలకీ, బలహీనతలకీ దాసుణ్ణి.
నాకు జీవితం బాధామయమనీ, క్షణికమనీ తెలుసు
నా ఇంద్రియాలు ప్రతిదానిచే కవ్వింపబడతాయనీ తెలుసు,
చివరగా, నాకు నేను మనిషినని తెలుసు, అందుకు
ఒక పక్క గర్వమూ, మరొకవంక దైన్యమూ ఉన్నాయి.
.
సర్ జాన్ డేవీస్,
16 April 1569 – 8 December 1626
ఇంగ్లీషు కవి