భ్రమ … మ్యూరియల్ రుకేసర్, అమెరికను కవయిత్రి

( గ్రీకు ఇతిహాసంలోని ఒక చిన్న సంఘటనని ఆధారంగా తీసుకుని ఒక పదునైన స్త్రీవాదకవిత అల్లింది కవయిత్రి, ఏ ఆర్భాటాలూ, ప్రవచనాలూ లేకుండా. కవిత ముగింపు ఎంత సునిశితంగా చేసిందో గమనించగలరు.)

.

చాలా కాలం గడిచేక
ఈడిపస్, వయసు ఉడిగి, గుడ్డివాడై రోడ్డుమీద నడుస్తున్నాడు.
అతనికి బాగా పరిచయమున్న వాసన ముక్కుపుటాలను తాకింది.
అది సింహిక (sphinx)ది.
ఈడిపస్ అన్నాడు:”నిన్నొక ప్రశ్న అడగాలని ఉంది.
నేను నా తల్లిని ఎందుకు గుర్తించలేకపోయాను?”
“నువ్వు తప్పు సమాధానం చెప్పేవు,” అంది సింహిక.
“కానీ అదొక్కటే గదా మూడింటికీ సరియైన సమాధానము?”
అన్నాడు ఈడిపస్.
“కాదు,” అంది సింహిక,
“నేను ఏది నాలుగుకాళ్ళతో ఉదయం, రెండుకాళ్ళతో మధ్యాహ్నం,
మూడు కాళ్ళతో సాయంత్రం నడుస్తుంది? అని అడిగినపుడు
నువ్వు మనిషి అన్నావు. నువ్వు స్త్రీ గురించి
మాటాడలేదు.”
“నేను మనిషి అన్నప్పుడు పురుషుడే కాదు
అందులో స్త్రీ అన్న అర్థం కూడా
కలిసే ఉంది, ఆ విషయం అందరికీ తెలిసిందే “అన్నాడు ఈడిపస్.
“అని నువ్వు అనుకుంటున్నావు,” అంది సింహిక.
.
మ్యూరియల్ రుకేసర్

(December 15, 1913 – February 12, 1980)

అమెరికను కవయిత్రి.

.

Myth

.

 Long afterward,

Oedipus, old and blinded, walked the roads. 

He smelled a familiar smell. 

It was the Sphinx. 

Oedipus said, “I want to ask one question.

Why didn’t I recognize my mother?”

“You gave the wrong answer,” said the Sphinx. 

“But that was what made everything possible,” said Oedipus. 

“No,” she said.

“When I asked,

What walks on four legs in the morning,

Two at noon, and three in the evening,

You answered, Man. 

You didn’t say anything about woman.”

“When you say Man,” said Oedipus,

“You include women too.

 Everyone knows that.” 

She said, “That’s what you think.”

.

 Muriel Rukeyser

(December 15, 1913 – February 12, 1980)

American Poet and Activist

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/2000/12/myth-muriel-rukeyser.html

“భ్రమ … మ్యూరియల్ రుకేసర్, అమెరికను కవయిత్రి”‌కి ఒక స్పందన

  1. this is a fantastic poem. I understood this with your write up only. it is very very nice technique to retell a old story. one should have guts to do so too sir.

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: