కిటికీ ప్రక్క బాలుడు… రిచర్డ్ విల్బర్, అమెరికను కవి

మంచుమనిషి (స్నోమాన్*) అలా ఒక్కడూ చీకటిపడ్డాక

చలిలో నిలబడటం చూసి తట్టుకోవడం అతనివశం కాలేదు.

ఈదురుగాలి ఇక రాత్రల్లా పళ్ళుకొట్టుకునేలా గడగడ వణికించడానికి

సిద్ధం అవడం చూసి ఆ చిన్ని కుర్రాడికి ఏడుపొచ్చింది.

బహిష్కృతుడైన ఏడం స్వర్గం వీడుతూ చూసిన చూపువంటి

దైవోపహతుడైన చూపు చూస్తున్న

పాలిన ముఖం, తారు కళ్ళుకలిగిన ఆ బొమ్మని

కన్నీరు నిండిన కళ్ళలోంచి అతని చూపులు చేరకున్నాయి.

అంత పరిస్థితిలోనూ, మంచుమనిషి సంతృప్తిగానే ఉన్నాడు,

అతనికి ఇంటిలోనికి పోయి చనిపోవాలని లేదు.

కానీ, ఆ పసివాడు ఏడవడం చూసిన అతనికి మనసు ద్రవించింది.

గడ్డకట్టిన నీరు అతని స్వభావం అయినప్పటికీ

అతని కరుణార్ద్రమైన కన్నులలోనుండి ఒక అశ్రుకణం

వానచినుకంత స్వచ్చమైనది కరిగి జారింది…

ఆ ఉజ్జ్వలమైన కిటికీప్రక్క కూచున్న కుర్రాడిని ఆవరించిన

అంత వెచ్చదనం, అంత వెలుగూ, అంతప్రేమా, అంత భయం చూసి.

.

రిచర్డ్ విల్బర్

జననం March 1, 1921

అమెరికను కవి

*స్నోమాన్: మంచుకురిసే ప్రాంతాల్లో చాపచుట్టినట్టు కురిసిన మంచును చుట్టి, దాన్ని గోళాకారంగా తయారు చేసి, ఇలాంటి 3 మంచుగోళాలను ఒక దాని మీద ఒకటి పేర్చి, దానికి ఎండుకొమ్మలు చేతులుగా, కేరట్ ముక్కుగా, తారు ఉండలను కళ్ళుగా అమర్చి, మఫ్లరు చుట్టి మనిషిలా తయారు చెయ్యడం పిల్లలకూ, పెద్దలకూ ఒక క్రీడ.

.

Boy at the Window

Seeing the snowman standing all alone

 In dusk and cold is more than he can bear.

 The small boy weeps to hear the wind prepare

 A night of gnashings and enormous moan.

 His tearful sight can hardly reach to where

 The pale-faced figure with bitumen eyes

 Returns him such a god-forsaken stare

 As outcast Adam gave to Paradise.

 The man of snow is, nonetheless, content,

 Having no wish to go inside and die.

 Still, he is moved to see the youngster cry.

 Though frozen water is his element,

 He melts enough to drop from one soft eye

 A trickle of the purest rain, a tear

 For the child at the bright pane surrounded by

 Such warmth, such light, such love, and so much fear.

.

Richard Wilbur

born March 1, 1921

American Poet and Translator Pulitzer Prize in 1957 & 1989

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/2006/07/boy-at-window-richard-wilbur.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: