కన్నులు… చెస్లా మీవోష్, పోలిష్ కవి ఘనమైన నా కనులారా, మీరు అంత కుశలంగా ఉన్నట్టు లేదు, మీదగ్గరనుండి నాకు వస్తున్న ఆకారాలు అంత నిశితంగా ఉండడంలేదు, రంగుబొమ్మలయితే, మరీను , మసకగా అలికినట్లుంటున్నాయి. ఒకప్పుడు మీరు రాజుగారు వేటకి తీసుకెళ్ళే వేటకుక్కల్లా ఉండేవారు, మీతో నేను ప్రతిరోజూ ఉదయాన్నే షికారుకి వేళ్ళేవాడిని. అద్భుతమైన చురుకుదనం కల నా కనులారా! మీరు చాలా విషయాలు చూసేరు, నగరాలూ, ప్రదేశాలూ, దీవులూ, మహాసముద్రాలు. అప్పుడే కరుగుతున్న మంచు జాడల్లో స్వచ్చమైన చిరుగాలి మనని పరుగులుతీయిస్తుంటే జతగా మనం ఎన్నో బ్రహ్మాండమైన సూర్యోదయాలను స్వాగతించాం మీరు చూసినవన్నీ ఇపుడు నా మదిలో భద్రంగా ఉన్నాయి జ్ఞాపకాలుగానో, కలలుగానో మిగిలిపోయి. నేను ఈ సుందరమైన ప్రకృతినుండి దూరంగా నిష్క్రమిస్తున్నాను పిచ్చి పిచ్చి దుస్తులన్నా, అరుపులూ, చప్పుళ్ళన్నా ఈ మధ్య నాకు చికాకు రావడం గమనిస్తున్నాను. ఎంత ప్రశాంతంగా ఉందో, మనుషుల మధ్య మౌలికమైన పోలికలూ, వెంట్రుకవాసి తేడాలూ గమనిస్తూ వాటిగురించి ఆలోచిస్తుంటే. కళ్ళుమూసుకుంటే, నా దృష్టి ఒక కాంతిబిందువుపై నిలిచి, అది వ్యాకోచిస్తూ వ్యాకోచిస్తూ నన్ను తనలోకి లాక్కుంటోంది. . చెస్లా మీవోష్ 30 June 1911 – 14 August 2004 పోలిష్ కవి 1980 Nobel Prize . . Eyes My most honorable eyes, you are not in the best of shape. I receive from you an image less than sharp, And if a color, then it’s dimmed. And you were a pack of royal greyhounds once, With whom I would set out in the early mornings. My wondrously quick eyes, you saw many things, Lands and cities, islands and oceans. Together we greeted immense sunrises When the fresh air set us running on the trails Where the dew had just begun to dry. Now what you have seen is hidden inside me And changed into memories or dreams. I am slowly moving away from the fairgrounds of the world And I notice in myself a distaste For the monkeyish dress, the screams and drumbeats. What a relief. To be alone with my meditation On the basic similarity in humans And their tiny grain of dissimilarity. Without eyes, my gaze is fixed on one bright point, That grows large and takes me in. . Czeslaw Milosz 30 June 1911 – 14 August 2004 Polish Poet, Translator and Diplomat Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2005/09/eyes-czeslaw-milosz.html Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… 2 వ్యాఖ్యలుజూలై 16, 2016