తోటలోని అబ్బాయి… హెన్రీ వాన్ డైక్, అమెరికను

చీకూ చింతలులేని ఆలోచనల ఉద్యానంలోకి

నేను కొత్తగా అడుగుపెట్టగానే, తలుపు తెరిచి కనిపించింది,

ఒక సారి లోనకి వెళదామా అనిపించింది, వెళ్ళి

అక్కడి దారుల్నీ, అక్కడి అందమైన లతానికుంజాలనీ

తాపడంచేసినట్టు విరిసినపూలని శోధిద్దామనిపించింది;

ఒకప్పుడు నేను అమితంగా ప్రేమించిన ఈ తోటలోకి ధైర్యంగా

అడుగుపెట్టేముందు ఒక నిష్కల్మషమైన గొంతు వినాలనిపించింది,

ఆ తోట తెలియకుండానే పోగొట్టుకున్నాను, అనుకోకుండా తారసపడింది.

సరిగ్గా ద్వారానికి ముందరే నాకో అబ్బాయి కనిపించేడు,

చాలా వింత కుర్రాడు, అయినా నాకు ఎంతో ఆప్తుడు, 

తను నాకై చేతులు చాచి, మెత్తగా నవ్వేడు,

ఏ పాప, భయాదులచాయలెరుగని కళ్ళతో ఆహ్వానిస్తూ,

“లోనకి రండి,” అన్నాడు,”కాసేపు నాతో ఆడుకొండి;

మీరు ఒకప్పుడు ఉండేవారే, ఆ అబ్బాయిని నేనే.”

.

హెన్రీ వాన్ డైక్

(November 10, 1852 – April 10, 1933)

అమెరికను రచయిత

 Henry Van Dyke

.

The Child in the Garden

WHEN to the garden of untroubled thought

I came of late, and saw the open door,

And wished again to enter, and explore

The sweet, wild ways with stainless bloom inwrought,

And bowers of innocence with beauty fraught,

It seemed some purer voice must speak before

I dared to tread that garden loved of yore,

That Eden lost unknown and found unsought.

Then just within the gate I saw a child,—

A stranger-child, yet to my heart most dear,—

Who held his hands to me, and softly smiled

With eyes that knew no shade of sin or fear:

“Come in,” he said, “and play awhile with me;

I am the little child you used to be.”

.

(From The Atlantic Magazine)

Henry van Dyke

(November 10, 1852 – April 10, 1933)

American Author and clergyman

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds.  Bliss Carman, et al.

Volume I. Of Home: of Friendship.  1904.

Poems of Home: I. About Children

http://www.bartleby.com/360/1/42.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: