ఈ పాఠం నువ్వు శ్రద్ధగా వినిపించుకోవాలి
మరో సారి, మరో సారి, మరోసారి ప్రయత్నించు;
మొదటిప్రయత్నంలో నువ్వు సఫలుడివి కాపోతే
మరో సారి, మరో సారి, మరోసారి ప్రయత్నించు.
ఒకటి, రెండు సార్లు నువ్వు విఫలమవొచ్చు,
మరోసారి ప్రయత్నించు;
నువ్వు చివరికి సాధించాలనుకుంటే,
మరోసారి ప్రయత్నించు.
మరోసారి ప్రయత్నించడం సిగ్గుచేటు కాదు
మనం పందెం గెలవకపోవచ్చు;
అలాంటప్పుడు ఏమిటి చెయ్యాలి?
మరోసారి ప్రయత్నించాలి.
నీకు నీ పని కష్టంగా తోచినపుడు,
మరోసారి ప్రయత్నించు;
కాలమే తగిన ప్రతిఫలం తీసుకొస్తుంది,
కనుక మరోసారి ప్రయత్నించు;
మిగతా అందరూ ఆ పని చెయ్యగలిగినపుడు,
నీకున్న ఓరిమికి నువ్వు సాధించవద్దూ?
కానీ, ఈ ఒక్క సూత్రం దృష్టిలో పెట్టుకో—
మరోసారి ప్రయత్నించు.
.
అజ్ఞాత కవి
.
Try Again
’T IS a lesson you should heed,
Try, try, try again;
If at first you don’t succeed,
Try, try, try again.
Once or twice though you should fail,
Try again;
If you would at last prevail,
Try again.
If we strive, ’t is no disgrace
Though we may not win the race;
What should you do in that case?
Try again.
If you find your task is hard,
Try again;
Time will bring you your reward,
Try again.
All that other folks can do,
With your patience should not you?
Only keep this rule in view—
Try again.
.
Anonymous
Poem Courtesy:
The World’s Best Poetry.
Eds: Bliss Carman, et al.
Volume I. Of Home: of Friendship. 1904.
Poems of Home: II. For Children
http://www.bartleby.com/360/1/78.html
1700th Post
స్పందించండి