కాకవంధ్య… సీలియా గిల్బర్ట్ , అమెరికను

(ఒకే చూలు కలిగిన స్త్రీని ‘కాకవంధ్య’  అంటారు)

.

చూరుమీద పావురాలు, పక్కన మంత్రసానులు,
రంగురంగుల కదలిక, విధి గురించి
ఏవో పిచ్చిమాటలు

నా పొట్టను మించిన ఒంటరితనం,
ఉమ్మనీరు,
అందులో నిగూఢంగా జీవిస్తూ జీవి

ఎవరూ మాటాడరు, ఎవరూ చూడరు,
గడియారం కదులుతుంటే బల్లమీద కాళ్ళు జాపుకుని.
సూర్యుడు బాగా ఎండ కాచి అస్తమిస్తాడు, చంద్రుడు లేస్తాడు.

15 నుండి 24, గర్భసంచీ వ్యాకోచించడం ప్రారంభిస్తుంది;
లీలగా జ్ఞాపకం: ప్రాణం కడకట్టుకుపోతోంది,
గుహలూ, కోటలూ…

హాల్లో పళ్ళేల చప్పుళ్ళు,
ఏమీ కనిపించడంలేదు, కేవలం ఒత్తిడి, సమ్మెటపోటులాంటిది,
లుంగలు చుట్టుకుపోతూ, వగరుస్తూ, నేను

గింజుకుంటున్నాను, విముక్తురాలనవడానికి,
జంతువునుతిన్న పాములా బయటకి కక్కలేక,
ఇంధనంపోసి సిద్ధం చేసిన ఇంజనులా,
చక్రంలా క్రిందామీదాపడుతూ,
ఒడ్డు మండిపోతుంటే…
ఎవరో అంటున్నారు…”ఆమె తల బయటకి వస్తోంది” అని.
.

సీలియా గిల్బర్ట్
అమెరికను

.

celia_gilbert

 

.

.

Primapara

(The medical term for a woman who has borne one child)

Pigeons on the ledge, midwives,

Iridescent motion, a babble

Of fates.

A lonesomeness bigger than my belly,

The waters,

The mystery indwelling.

Nobody talks, nobody sees,

Spread-eagled on the clock counting.

Sun flames and sets, moon swells.

Omicron to omega, cervix dilates,

Flicker of memory: sand and furrow,

Cave and castle.

Trays rattle in the hall,

No sky now, just pressure, hammer.

I’m a creature that ripples, pants,

Struggles, to get free,

A snake with swallowed wealth,

An engine primed to change,

A cartwheel, head over heels

To the burning of ghats.

I hear them say,”She is crowning”-

.

Celia Gilbert

American

Poem Courtesy:  

Poetry Magazine April 1990 http://www.poetryfoundation.org/poetrymagazine/browse?volume=156&issue=1&page=18

 

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: